AP Politics: డేట్, టైమ్ చెబుతారా.. చెప్పాలా..? వైవీకి షర్మిల సవాల్
ABN, Publish Date - Jan 23 , 2024 | 12:37 PM
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ విపక్షాల మధ్య విమర్శలు- ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతలు ధాటిగా విమర్శించేవారు. ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేరిపోయారు.
శ్రీకాకుళం జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) వర్సెస్ విపక్షాల మధ్య విమర్శలు- ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతలు ధాటిగా విమర్శించేవారు. ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేరిపోయారు. పీసీసీ చీఫ్ పదవీ చేపట్టిన వెంటనే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇచ్చాపురం పర్యటనలో వైసీపీ, వైవీ సుబ్బారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. షర్మిలకు ఇక్కడి అభివృద్ధి ఏం తెలుసు అని ఆయన ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలపై ఈ రోజు షర్మిల స్పందించారు. ‘మీరు చేసిన అభివృద్ధి చూపించండి. డెవలప్ మెంట్ చూడటానికి సిద్ధంనా ఉన్నా. డేట్, టైం మీరు చెబుతారా..? నన్ను చెప్పమన్నా చెబుతా. ఆ డిబేట్‌కు మేధావులను పిలుద్ధాం. నాతో పాటు మీడియా వస్తుంది. ప్రతిపక్షాలు వస్తాయి. గత నాలుగున్నరేళ్లలో మీరు చేసిన అభివృద్ధిని మా అందరికీ చూపించండి. మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ ? మీరు చెప్పిన రాజధాని ఎక్కడా? పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా? మీ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలని అనుకుంటున్నారు. మీ సవాల్‌ను స్వీకరిస్తున్నా అని’ వైఎస్ షర్మిల ఓపెన్ ఛాలెంజ్ చేశారు. షర్మిల ఛాలెంజ్‌పై వైవీ సుబ్బారెడ్డి స్పందించాల్సి ఉంది.
షర్మిల తన సోదరుడు ఏపీ సీఎం జగన్‌ను ఇటీవల జగన్ రెడ్డి అని పిలిచారు. అలా పిలవడం వైవీరెడ్డికి నచ్చలేదట.. ఇక నుంచి ‘జగన్ అన్న గారు’ అని పిలుస్తా అని ప్రకటించారు. జగన్‌ను అలా పిలవడానికి తనకేం అభ్యంతరం లేదని షర్మిల సెటైర్లు వేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 23 , 2024 | 12:56 PM