ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనంత పోలీసుల కస్టడీలో బోరుగడ్డ

ABN, Publish Date - Dec 09 , 2024 | 05:31 AM

వైసీపీ నేత, రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న ఆయన్ను ఆదివారం తెల్లవారుజామున అనంతపురం తీసుకొచ్చారు.

  • విచారణలో ‘తెలియదు, గుర్తులేదు..’ సమాధానాలు

అనంతపురం క్రైం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న ఆయన్ను ఆదివారం తెల్లవారుజామున అనంతపురం తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులను అసభ్యకరంగా విమర్శిస్తూ బోరుగడ్డ యూట్యూబ్‌ చానల్‌లో మాట్లాడారని తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజశ్విని నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ నిమిత్తం బోరుగడ్డను కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి కోర్టు నుంచి మూడు రోజుల కస్టడీ కోరారు. శనివారం అతనికి వైద్య పరీక్షలు అక్కడే నిర్వహించారు. కాగా, బోరుగడ్డ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన్ను తెల్లవారుజామున 1.20 గంటల సమయంలో పోలీసుస్టేషన్‌కు తీసుకురాగా.. అప్పటికే అక్కడి లైట్లన్నీ ఆర్పేశారు. వచ్చీ రాగానే అనిల్‌ను లోపలకు తీసుకెళ్లారు. ఆదివారం సైతం పోలీసుస్టేషన్‌కు తాళం వేశారు.

  • విచారణకు సహకరించని అనిల్‌

విచారణలో అనిల్‌ పోలీసులకు సహకరించలేదని సమాచారం. ‘తెలియదు.. పెద్దగా గుర్తులేదు..’ అనే సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆదివారం అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో విచారించారు. వీఆర్వోల ఎదుట స్టేట్‌మెంట్‌ను తీసుకున్నట్లు తెలిసింది. అనిల్‌ గతంలో మాట్లాడిన వీడియోల ఆధారంగా ‘నువ్వే కదా ఈ వీడియోలో మాట్లాడింది’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. 3 రోజుల కస్టడీ తర్వాత అతనికి సోమవారం సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించి, స్థానిక కోర్టులో హాజరుపరిచిన తర్వాత రాజమండ్రి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణ సమయాన్ని చూపి మంగళవారం ఉదయం అక్కడి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

Updated Date - Dec 09 , 2024 | 05:31 AM