Perni Narani : పోలీసు నోటీసులను రద్దు చేయండి
ABN, Publish Date - Dec 24 , 2024 | 06:41 AM
గోదాము నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలంటూ మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ వైసీపీ నేత పేర్ని నాని..
హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని, కృష్ణమూర్తి
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): గోదాము నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలంటూ మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ వైసీపీ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు సాయి కృష్ణమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసు నోటీసులను రద్దు చేయాలని కోరారు. తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరపనుంది.
Updated Date - Dec 24 , 2024 | 06:41 AM