మాజీ మంత్రి కాకాణి అనుచరుడిపై లైంగిక దాడి కేసు
ABN, Publish Date - Dec 24 , 2024 | 04:07 AM
మందల వెంకట శేషయ్య... మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు. వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు కూడా..
ఉద్యోగం ఆశ చూపి అత్యాచారం
బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు
పోలీసుల అదుపులో వెంకట శేషయ్య
వెంకటాచలం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మందల వెంకట శేషయ్య... మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు. వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు కూడా. భర్త మరణంతో ఒంటరైన మహిళకు ఆయన మాయ మాటలు చెప్పాడు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సోమవారం సాయంత్రం వెంకట శేషయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండల కేంద్రమైన వెంకటాచలం పంచాయతీ దొడ్డరాజుపాళెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైన్‌మన్‌గా ఉద్యోగం చేసేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కొన్నేళ్ల కిందట ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొన్నాడు. మృతుని ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద ఇప్పిస్తానంటూ లైన్‌మన్ భార్యకు వెంకట శేషయ్య నమ్మబలికి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వెంకటాచలం స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా, సోమవారం రాత్రి 10.30గంటలకు ఇద్దరు న్యాయవాదులు, భారీ అనుచరగణంతో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖరరెడ్డి అర్ధరాత్రి వరకూ స్టేషన్‌లోనే ఉన్నారు.
Updated Date - Dec 24 , 2024 | 04:07 AM