ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Business : క్రెడిట్ కార్డ్ వాడేవారికి సుప్రీంకోర్టు ఝలక్..

ABN, Publish Date - Dec 21 , 2024 | 08:35 PM

క్రెడిట్ కార్డు వాడేవారికి చేదు వార్త. వారంతా, ఇక మీదట జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే, క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై ఒక ముఖ్యమైన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. భారతదేశంలోని లక్షలాది మంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై ఈ తీర్పు ప్రభావం చూపనుంది. ఆ తీర్పులో ఏముందంటే..

Credit Card

క్రెడిట్ కార్డు వినియోగదారులకు చేదు వార్త. బిల్లులు ఆలస్యంగా చెల్లించేవారు ఇక మీదట జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే వడ్డీల మోతకు బలవ్వాల్సిందే. ఎందుకంటే, క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై ఇప్పటివరకూ ఉన్న 30% పరిమితిని తొలగిస్తూ ఒక ముఖ్యమైన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. తద్వారా, బ్యాంకులు అధిక ఛార్జీలు వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో లేటుగా బిల్లు చెల్లించే క్రెడిట్ కార్డు హోల్డర్లుపై ఆర్థిక భారం అధికం కానుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.


ఆలస్య బిల్లు చెల్లింపులపై క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను ఏటా 30% పరిమితం చేస్తూ 2008లో నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC)తీర్పును సుప్రీంకోర్టు డిసెంబర్ 20న రద్దు చేసింది. వడ్డీ రేట్లను నిర్ణయించుకునే అవకాశం బ్యాంకులకే కల్పిస్తూ తీర్పు వెలువరించింది. ఎన్‌సిడిఆర్‌సి తీర్పును పక్కన పెట్టడంతో.. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని వినియోగదారుల నుంచి అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేసేందుకు బ్యాంకులకు లైన్ క్లియర్ అయింది.


క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను పరిమితం చేసే అధికారం NCDRC లేదని సవాలు చేశాయి.. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హాంకాంగ్ మరియు షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ (HSBC)లు. 30% పరిమితిని ఎత్తివేయాలని న్యాయమూర్తులు బేలా త్రివేది మరియు సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేశాయి.


25 మార్చి 2008 నాటి NCDRC ఉత్తర్వును రద్దు చేస్తూ సుప్రీం కోర్ట్ తీసుకున్న నిర్ణయం క్రెడిట్ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో క్రెడిట్ కార్డు వాడేవారు బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని.. సకాలంలో బిల్లులు చెల్లించి అధిక వడ్డీ భారం పడకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు.

Updated Date - Dec 21 , 2024 | 08:35 PM