Share News

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

ABN , Publish Date - Dec 01 , 2024 | 11:34 AM

దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవుల లిస్ట్ మళ్లీ రానే వచ్చింది. ఈసారి బ్యాంకులకు భారీగా సెలవులు వచ్చాయి. దీంతో బ్యాంకులు డిసెంబర్‌ నెలలో కొన్ని రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. అయితే ఏయే తేదీల్లో బ్యాంకులు పనిచేయనున్నాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Bank holidays december 2024

ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా బ్యాంకు సెలవుల (Bank Holidays December 2024) జాబితా వచ్చేసింది. అయితే ఈసారి డిసెంబర్ 2024లో 17 రోజుల పాటు బ్యాంకులు బంద్ ఉంటాయి. జాతీయ, స్థానిక పండుగలు, ఇతర కారణాల వల్ల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన క్యాలెండర్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పండుగలకు సెలవులు ఉన్నాయి. ప్రతి ఆదివారం, రెండో, నాల్గో శనివారం కూడా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ వారపు సెలవులతో కలిపి ఈ నెల 17 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.


ఈ రోజుల్లో బ్యాంకులు మూసివేయబడతాయి

  • డిసెంబర్ 1: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

  • డిసెంబర్ 3: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ సందర్భంగా గోవాలో సెలవు

  • డిసెంబర్ 10: మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు

  • డిసెంబర్ 11: (UNICEF పుట్టినరోజు) అన్ని బ్యాంకులకు సెలవు

  • డిసెంబర్ 12: మేఘాలయలో ప టోగన్ నెంగ్మింజా సంగ్మా సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి

  • డిసెంబర్ 18 : యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయ, చండీగఢ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి


  • డిసెంబర్ 19 : గోవా విమోచన దినోత్సవం రోజున గోవాలో బ్యాంకులు మూసివేయబడతాయి

  • డిసెంబర్ 24: గురు తేగ్ బహదూర్ బలిదానం రోజు, క్రిస్మస్ ఈవ్ నేపథ్యంలో మిజోరం, మేఘాలయ, పంజాబ్, చండీగఢ్‌లలో బ్యాంకులు బంద్

  • డిసెంబర్ 25: క్రిస్మస్ సందర్భంగా భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి

  • డిసెంబర్ 26: బాక్సింగ్ డే, క్వాంజా సందర్భంగా అన్ని బ్యాంకులకు సెలవు

  • డిసెంబర్ 30: తము లోసార్ సందర్భంగా సిక్కిం, మేఘాలయలో బ్యాంకులకు హాలిడే

  • డిసెంబర్ 31: నూతన సంవత్సర వేడుక నేపథ్యంలో మిజోరంలో బ్యాంకులు బంద్

  • డిసెంబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో : ఆదివారం సెలవుల కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి

  • డిసెంబర్ 14, 28 తేదీల్లో: రెండు, నాల్గో శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు


ఈ సేవలు మాత్రం

సెలవు రోజుల్లో కూడా ఖాతాదారులు డిజిటల్ బ్యాంకింగ్, UPI, IMPS, నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటి ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. వీటిలో చెక్‌బుక్‌లను ఆర్డర్ చేయడం, బిల్లులు చెల్లించడం, ప్రీపెయిడ్ ఫోన్‌లను రీఛార్జ్ చేయడం, డబ్బు బదిలీ చేయడం, హోటల్‌లను బుక్ చేయడం, ప్రయాణానికి టిక్కెట్‌లు, మీ ఖర్చు వివరాలను చూడటం వంటివి మరెన్నో ఉన్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా చెక్కుల చెల్లింపును నిలిపివేసే ప్రక్రియ ఇప్పుడు మరింత సరళంగా మారింది.


ఇవి కూడా చదవండి:

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 01 , 2024 | 11:37 AM