Missed Call: మీ బ్యాంక్ బ్యాలెన్స్ మిస్డ్ కాల్ ఇచ్చి ఇలా తెలుసుకోండి..
ABN , Publish Date - Oct 19 , 2024 | 09:07 PM
మీరు ఇకపై మీ ఇంట్లో కూర్చుని మీ బ్యాంకు బ్యాలెన్స్ వివరాలను ఈజీగా ఒక్క క్షణంలో తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు ఎలాంటి యాప్స్ ఓపెన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అదే మిస్డ్ కాల్ ఛాన్స్. దీని ద్వారా మీరు మీ బ్యాంక్ ఖాతా వివరాలను పొందవచ్చు.
మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్(bank balance) వివరాలు తెలుసుకోవాలని చుస్తున్నారా. దీనికి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. అంతేకాదు దీనికోసం మీరు యాప్ లేదా ఏటీఎం కేంద్రాలకు వెళ్లాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఇకపై మీరు ఒక నంబర్‌కు మీరు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. మీ ఖాతాకు సంబంధించిన వివరాలు మీకు మెసేజ్ రూపంలో లభిస్తాయి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్‌ని సులభంగా చెక్ చేసుకోవచ్చు. దేశంలోని అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇంట్లో కూర్చొని తమ బ్యాంకు బ్యాలెన్స్‌ని చెక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
ఈ నంబర్లకు మాత్రమే
దీంతో కస్టమర్లు మిస్డ్ కాల్ లేదా మెసేజ్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. కస్టమర్ తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మేసెజ్ పంపడం లేదా కాల్ చేయడం ద్వారా బ్యాలెన్స్‌ను ఈజీగా చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి ప్రతి బ్యాంక్‌కి వేరే నంబర్ ఉంటుంది. మీ ఖాతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటే బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి మీరు 09223766666 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఆ తర్వాత మెసేజ్ రూపంలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు మీకు లభిస్తాయి. సందేశం ద్వారా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి మీరు BAL అనే సందేశాన్ని 09223766666 నంబర్‌కు పంపించాలి.
ఆన్‌లైన్ చెల్లింపులు
మీ బ్యాంక్ ఖాతా మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడినప్పుడు మాత్రమే ఈ సేవ ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే మీరు ముందుగా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి మీ మొబైల్ నంబర్‌ను మీ ఖాతాకు లింక్ చేసుకోవాలి. మరోవైపు UPI ఆన్‌లైన్ చెల్లింపును కూడా చాలా సులభతరం చేశారు. ఉదాహరణకు మీ Paytm ఖాతా Axis బ్యాంక్‌కి లింక్ చేయబడి ఉంటే మీరు బ్యాలెన్స్, హిస్టరీకి వెళ్లి UPI PINని నమోదు చేయడం ద్వారా బ్యాలెన్స్‌ని తనిఖీ చేసుకోవచ్చు.
గతంలో..
గతంలో బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవడానికి ఖాతాదారులు ATM లేదా బ్యాంకుకు వెళ్లాల్సి ఉండేది. ఆ తర్వాత ఆన్‌లైన్ బ్యాంక్ యాప్స్ వచ్చిన తర్వాత ఆన్‌లైన్ విధానంలో చెక్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ సౌకర్యాన్ని కస్టమర్లకు మరింత సులభతరం చేశారు. దీంతో మీరు ఇంట్లోనే కూర్చుని బ్యాంకు బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు. అయితే అనేక బ్యాంకులకు ఆయా నంబర్లను తెలుసుకుని వాటికి మిస్డ్ కాల్ లేదా మేసెజ్ చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..
Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..
Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్‌కు భారీ షాక్.. 11 నెలల కనిష్టానికి షేర్లు
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News