శ్రీసిటీలో కంప్రెసర్ల తయారీ ప్లాంట్
ABN , Publish Date - Dec 18 , 2024 | 01:37 AM
ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ తయారీ దిగ్గజం డైకిన్ ఇండస్ర్టీస్.. తైవాన్‌కు చెందిన రెచీ ప్రెసిషన్ సంయుక్త భాగస్వామ్యం (జేవీ)లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో కంప్రెసర్ల తయారీ ప్లాంట్...
తైవాన్ సంస్థ రెచీ ప్రెసిషన్‌తో డైకిన్ జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ తయారీ దిగ్గజం డైకిన్ ఇండస్ర్టీస్.. తైవాన్‌కు చెందిన రెచీ ప్రెసిషన్ సంయుక్త భాగస్వామ్యం (జేవీ)లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో కంప్రెసర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీలకు రోటరీ కంప్రెసర్ల డిజైన్, తయారీ, విక్రయం కోసం ఒక జేవీ ఏర్పాటు చేయబోతున్నట్టు రెండు సంస్థలు ప్రకటించాయి. ఈ ప్లాంట్‌లో దేశీయ మార్కెట్‌తో పాటు కొన్ని ఎంపిక చేసిన విదేశీ మార్కె ట్ల కోసం కంప్రెసర్లు తయారుచేస్తారు. ఈ ప్రాజెక్టుపై పెట్టుబడి ఎంత అన్నది డైౖకిన్ ప్రకటించకపోయినప్పటికీ సుమారు రూ.1,000 కోట్లు ఉంటుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. వచ్చే ఐదారేళ్ల కాలంలో ఈ మొ త్తం ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఈ జేవీలో డైకిన్ మెజారిటీ భాగస్వామిగా ఉండనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఈ ప్లాంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హెచ్‌వీఏసీ (హీటింగ్, వెంటిలేషన్, ఏసీ, రిఫ్రిజిరేషన్) విభాగంలో రోటరీ కంప్రెసర్లు, మోటార్లు, ఇతర విడిభాగాల తయారీలో రెచీ ప్రెసిషన్‌కు మంచి పేరుంది. కాగా ఇప్పటికే శ్రీసిటీలో ప్లాంట్‌ను నిర్వహిస్తున్న డైకిన్ భారత హెచ్‌వీఏసీ మార్కెట్లో అగ్రగామి కంపెనీల్లో ఒకటిగా ఉంది.