Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
ABN , Publish Date - Nov 25 , 2024 | 09:17 AM
మీరు 20 ఏళ్లలో రూ. 5 కోట్ల రూపాయలు సంపాదించాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. అందుకోసం ఏ స్కీంలో పెట్టుబడులు చేస్తే మంచిది. దీనికోసం నెలకు ఎంత పెట్టుబడి చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని చూస్తున్నారా. దీని కోసం మంచి ప్రణాళికను రూపొందించుకోవడం చాలా ముఖ్యం. అయితే మీరు 20 ఏళ్లలో 5 కోట్ల రూపాయలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఏ స్కీంలో పెట్టుబడి చేస్తే బెటర్ అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీకు స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేకుంటే, మీరు ఎక్కువ రిస్క్ తీసుకోకూడదనుకుంటే, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచి ఎంపిక. మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి మీకు మంచి లాభాలను ఇస్తుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి లేదా నెలవారీగా కూడా పెట్టుబడులు చేయవచ్చు. అందుకోసం నెలవారీ పెట్టుబడి మార్గమైన SIP విధానం మంచి ఎంపిక.
నెలకు ఎంత చెల్లించాలంటే
సిప్ విధానంలో ప్రస్తుతం సంవత్సరానికి సగటున 12% వడ్డీ రేటుతో రాబడులు వస్తున్నాయి. ఈ క్రమంలో మీరు రూ. 5 కోట్ల మొత్తాన్ని 20 ఏళ్లలో పొందాలంటే నెలకు రూ. 51 వేలు ఆదా చేయాల్సి ఉంటుంది. సిప్ క్యాలిక్యూటర్ ప్రకారం మీరు 20 ఏళ్లలో పెట్టుబడి చేసే మొత్తం రూ. 1,22,40,000కి చేరుకుంటుంది. కానీ 20 ఏళ్ల తర్వాత మీకు వచ్చే మొత్తం రూ. 5,09,56,544 అవుకుంది. ఈ నేపథ్యంలో మీకు వడ్డీ రూపంలోనే రూ. 3,87,16,544 లభిస్తాయి. ఒక వేళ మీరు 25 ఏళ్ల వ్యవధిలో రూ. 5 కోట్లు దక్కించుకోవాలని చూస్తే మీరు నెలకు రూ.26,500 పెట్టుబడి పెట్టాలి. మీరు 30 ఏళ్లలో రూ. 5 కోట్లకు చేరుకోవాలంటే నెలవారీగా రూ. 14,250 SIP చెల్లిస్తే సరిపోతుంది.
మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్
ఈ విధంగా మీరు ప్రతి నెలా రూ. 50,000, రూ. 26,500 లేదా రూ. 14,250 స్థిరంగా పెట్టుబడి పెడితే, మీరు 12% వార్షిక రాబడి ఆధారంగా 20, 25 లేదా 30 సంవత్సరాలలో రూ. 5 కోట్లను దక్కించుకునే అవకాశం ఉంది. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ గత 5 సంవత్సరాలలో 18% వార్షిక రాబడిని అందించగా, మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 25% కంటే ఎక్కువ CAGR రాబడిని ఇచ్చాయి.
లక్ష్యాన్ని చేరుకోవడంలో
అనేక ఇతర ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలు కూడా మంచి రాబడులను ఇచ్చాయి. పెట్టుబడి మధ్యలోనే ఆగిపోతే రూ.5 కోట్లు సమీకరించేందుకు మీకు మరింత సమయం పట్టవచ్చు లేదా లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందులు తలెత్త ఛాన్స్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పొందిన వడ్డీ రేటు మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్లు పాజిటివ్ ధోరణుల్లో ఉంటే ఇది పెరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..
Read More Business News and Latest Telugu News