Electoral Bond Donations: ఎలక్టోరల్ బాండ్ల విరాళంలో ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ రూ.1,368 కోట్లతో టాప్.. అసలేంటీ దీని కథ
ABN , Publish Date - Mar 15 , 2024 | 12:26 PM
దేశంలో రాజకీయ పార్టీలకు ఇచ్చే నిధుల పరంగా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ టాప్ స్థానంలో నిలిచింది. దీంతో అసలు దీని నేపథ్యం ఏంటీ, దీని యజమానులు ఎవరు, వీరు ఏం వ్యాపారం చేస్తారనే చర్చ మొదలైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
భారత ఎన్నికల సంఘం ఇటివల ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) వివరాలను వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత మార్చి 14న ఎన్నికల విరాళాలకు(donations) సంబంధించిన సమాచారాన్ని బహిర్గతపరిచింది. అయితే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 763 పేజీలను కలిగి ఉన్న రెండు జాబితాలు ఉన్నాయి. వాటిలో ఒక జాబితాలో బాండ్లను కొనుగోలు చేసే కంపెనీలు, వాటి తేదీ వంటి మొత్తం అంశాలను పేర్కొన్నారు. రెండో జాబితాలో రాజకీయ పార్టీలు, వారికి అందించిన విరాళాలు చూపబడ్డాయి.
అయితే ఈ లిస్టులో ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ(Future Gaming and Hotel Services) రూ.1368 కోట్ల విరాళంతో అగ్రస్థానంలో ఉండటం విశేషం. దీంతో అసలు ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సర్వీసెస్ నేపథ్యం ఏంటీ, ఇంత పెద్ద మొత్తంలో విరాళాలను ఎలా అందించిందనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఎన్నికల్లో రూ.980 కోట్లు విరాళంతో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(Megha Engineering & Infrastructures Limited) రెండో స్థానంలో ఉంది.
ఇక ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ 12 ఏప్రిల్ 2019 నుంచి 24 జనవరి 2024 మధ్య రూ. 1368 కోట్లను విరాళంగా అందించింది. ఫ్యూచర్ గేమింగ్ అనే సంస్థ కోయంబత్తూర్ కేంద్రంగా ఏర్పాటైంది. ఇది 1991 సంవత్సరంలో మార్టిన్ లాటరీ ఏజెన్సీస్ లిమిటెడ్ ద్వారా ప్రారంభించబడింది. ఇది భారతదేశంలోని లాటరీ కింగ్ అని పిలువబడే శాంటియాగో మార్టిన్(Santiago Martin) యాజమాన్యంలో ఉంది. ఈ సంస్థ వెబ్‌సైట్ ప్రకారం మార్టిన్ 13 ఏళ్ల వయస్సులో లాటరీ వ్యాపారంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.
ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, కేరళ(kerala), మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ సహా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలలో చట్టబద్ధంగా ఫ్యూచర్ గేమింగ్ బిజినెస్ చేస్తున్నారు. 2003లో తమిళనాడు(tamilnadu)లో లాటరీని నిషేధించిన తర్వాత శాంటియాగో మార్టిన్ తన వ్యాపారాన్ని కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు విస్తరించాడు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఏప్రిల్ నుంచి కాకినాడ ప్లాంట్‌లో పెన్సిలిన్ ఉత్పత్తి
ఈ క్రమంలో ఆయన దేశవ్యాప్తంగా(india) లాటరీ కొనుగోలుదారులు, అమ్మకందారుల నుంచి మంచి నెట్‌వర్క్(network)ను కల్గి ఉన్నాడు. మార్టిన్ లైబీరియాకు కాన్సిల్ జనరల్‌గా కూడా ఉన్నారు. అక్కడ అతను లాటరీ పరిశ్రమను కూడా స్థాపించారు. శాంటియాగో మార్టిన్ లాటరీ పంపిణీదారుగా ఉండగా.. అతను ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్, స్టాకిస్టులు, ఏజెంట్ల లాబీకి కూడా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. లాటరీ టిక్కెట్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని(income) అక్రమంగా బహుమతులు, ప్రోత్సాహకాల వైపు రూ.400 కోట్లు మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో 2014- 2017 మధ్య ఈ కంపెనీపై ఈడీ సోదాలు చేసి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది.