Share News

Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..

ABN , Publish Date - Nov 13 , 2024 | 04:10 PM

క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. ఎందుకంటే నవంబర్ 15 నుంచి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..
credit card New rules

దేశంలో ప్రస్తుతం కోట్లాది మంది వినియోగదారులు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల గురించి కూడా తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ICICI బ్యాంక్ తాజాగా క్రెడిట్ కార్డు నిబంధనలను మార్చింది. మీకు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంటే ఈ రూల్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


ఏయే రూల్స్ మారాయంటే..

  • విద్యా లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు ఉండవు

  • ఆలస్యమైన కార్డ్ చెల్లింపు రుసుములకు ఛార్జీలలో మార్పు

  • యుటిలిటీ, ఇంధన చెల్లింపులపై కొత్త రకాల ఛార్జీలు వసూలు

  • క్రెడిట్ కార్డ్ ద్వారా అంతర్జాతీయ విద్య లేదా పాఠశాల కళాశాల ఫీజు చెల్లించడానికి ఎటువంటి ఛార్జీ విధించబడదు


నవంబర్ 15 నుంచి లేట్ పేమెంట్ ఛార్జీలలో మార్పు

-రూ.101 నుంచి రూ. 500- రూ.100 ఛార్జీ

-రూ.501 నుంచి రూ.1,000- రూ.500 ఛార్జీ

-రూ.1,001 నుంచి రూ.5,000-రూ.600 ఛార్జీ వసూలు చేస్తారు

-రూ.5,001 నుంచి రూ.10,000- రూ.750 ఛార్జీ వసూలు చేస్తారు

-రూ.10,001 నుంచి రూ.25,000 - రూ.900 ఛార్జీ

-రూ.25,001 నుంచి రూ.50,000- రూ.1100 ఛార్జీ వసూలు

-రూ.50,000 కంటే ఎక్కువ- రూ.1300 ఛార్జీ


నెలవారీ ఖర్చులు

రూబిక్స్, సఫిరో, ఎమరాల్డ్ కార్డ్‌లు యుటిలిటీ చెల్లింపులు, రూ. 80,000 వరకు నెలవారీ ఖర్చులు ఉంటాయి. ఈ పరిమితి వరకు బీమా చెల్లింపులపై రివార్డ్ పాయింట్‌లను అందించడం కొనసాగిస్తుంది. ఇది కాకుండా ఇతర కార్డులకు ఈ పరిమితి రూ. 40 వేలు. అదేవిధంగా ఐసీఐసీఐ బ్యాంక్ రూబిక్స్ వీసా, సఫిరో వీసా, ఎమరాల్డ్ వీసా కార్డ్ హోల్డర్‌లు నెలవారీ కిరాణా ఖర్చు రూ. 40,000 వరకు రివార్డ్ పాయింట్‌లను పొందగలరు. మిగిలిన వారికి ఈ పరిమితి రూ.20 వేలుగా ఉంది.


యుటిలిటీ, ఇంధన చెల్లింపుపై ఇతర ఛార్జీలు

  • మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 50,000 కంటే ఎక్కువ యుటిలిటీ చెల్లింపులు చేస్తే, మీరు 1 శాతం ఛార్జ్ చెల్లించాలి.

  • మీరు 1000 రూపాయల కంటే ఎక్కువ ఇంధన చెల్లింపు లావాదేవీ చేస్తే, మీరు దానిపై 1% ఛార్జ్ చెల్లించాలి.

  • పొడిగించిన క్రెడిట్, నగదు అడ్వాన్సులపై ఓవర్ డ్యూ వడ్డీ నెలకు 3.75 శాతం వసూలు చేయబడుతుంది. అయితే దీనిపై వార్షిక వడ్డీ రేటు 4.5 శాతంగా ఉంటుంది.

  • గమనిక: మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే ఈ మారిన ఛార్జీలు, ఫీజులన్నింటినీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి

  • సప్లిమెంటరీ కార్డ్ హోల్డర్లకు బ్యాంక్ వార్షిక రుసుము రూ.199 ప్రారంభించింది. అదేవిధంగా నవంబర్ 15 నుంచి ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా CRED, Paytm, Cheq, MobiKwik వంటి థర్డ్-పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా విద్యాపరమైన చెల్లింపు చేస్తే లావాదేవీ మొత్తంపై 1 శాతం ఛార్జీ విధించబడుతుంది.


ఇవి కూడా చదవండి:

Jobs: గుడ్‌న్యూస్ త్వరలో 3.39 కోట్ల ఉద్యోగాలు.. ఏ రంగంలో ఉంటాయంటే.


Life Certificate 2024: మీ పెన్షన్ ఆగకుడదంటే ఇలా చేయండి.. కొన్ని రోజులే గడువు..

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 13 , 2024 | 04:10 PM