Share News

Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు

ABN , Publish Date - Dec 05 , 2024 | 12:39 PM

సాధారణంగా ఎవరైనా కూడా తక్కువ సమయంలోనే కోటీశ్వరులు కావాలని చూస్తారు. ఇప్పుడు అది పలువురి విషయంలో నిజం అయ్యింది. అది కూడా తక్కువ పెట్టుబడితో కోటీశ్వరులుగా మారిపోయారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Bitcoin Investments

ఇటివల కాలంలో స్టాక్ మార్కెట్‌లో (stock market) ఇన్వెస్ట్ చేసే వారికి పలు రకాల పెన్నీ స్టాక్స్ మంచి లాభాలను అందిస్తున్నాయి. కేవలం వేల రూపాయల పెట్టుబడులు చేసిన వారిని లక్షాధికారులను చేస్తున్నాయి. మాములుగా అయితే రెండింతల లాభం లేదా అంతకు మించి రావాలంటే 5 నుంచి 10 ఏళ్లు పడుతుంది. కానీ నాలుగేళ్ల క్రితం వినూత్నంగా ఆలోచించి బిట్ కాయిన్‌పై పెట్టుబడులు (Bitcoin Investment) చేసిన వారు ప్రస్తుతం కోటీశ్వరులుగా మారారు. అవును మీరు విన్నది నిజమే. అయితే ఎంత పెట్టుబడి చేశారు, ఎలా వారి ఆదాయం ఎలా పెరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


ఆశ్చర్యకరమైన రాబడి

అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో మరోసారి బిట్ కాయిన్ (Bitcoin) వార్తల్లో నిలిచింది. అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత దీనిలో పెరుగుదల భారీగా కనిపిస్తోంది. వాస్తవానికి బిట్‌కాయిన్ 2009 సంవత్సరంలో ప్రారంభించబడింది. అప్పుడు దీని ధర సున్నా రూపాయలు. కానీ ఇప్పుడు 2024 డిసెంబర్ 5 నాటికి ఒక బిట్‌కాయిన్ ధర 86 లక్షల రూపాయలకు చేరుకుంది.

ఆ సమయంలో

నవంబర్ 24 గురించి మాట్లాడితే ఒక బిట్‌కాయిన్ ధర 97,654.9 డాలర్లు, అంటే దాదాపు 82.43 లక్షల రూపాయలు. అంటే ఈ పెట్టుబడి ఆశ్చర్యకరమైన రాబడిని ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2011లో బిట్‌కాయిన్ ధర కేవలం 1 డాలర్ అంటే 45.50 రూపాయలు. ఆ సమయంలో ఎవరైనా 100 రూపాయలు పెట్టుబడి పెట్టి 2.22 బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేసి ఉంటే, ఇప్పుడు లక్ష డాలర్ల ప్రకారం దాని విలువ 1.72 కోట్లకు చేరి ఉండేది.


కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ

దీంతో వీటిలో పెట్టుబడులు చేసిన వారు ప్రస్తుతం ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు అదే సమయంలో పెట్టబడులు చేయాలని చూసి, ఆగిపోయిన వారి మాత్రం ప్రస్తుతం నిరాశ పడుతున్నారు. తక్కువ సమయంలోనే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ మిస్సైందని భావిస్తున్నారు. 2020లో కరోనా సమయంలో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు పడిపోయాయి. అదే సమయంలో క్రిప్టోకరెన్సీ విలువ 7,161 డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీ ప్రకారం చూస్తే 5,72,880 రూపాయలు.

ఆ సమయంలో రెండు బిట్ కాయిన్లు తీసుకున్నా కూడా వారు ఇప్పుడు కోటీశ్వరులుగా మారిపోయారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఒక్క బిట్ కాయిన్ విలువ లక్ష డాలర్లను దాటేసింది. ప్రస్తుతం భారత కరెన్సీ ప్రకారం చూస్తే ఒక బిట్ కాయిన్ విలువ రూ. 86 లక్షలుగా ఉంది. అంటే నాలుగేళ్ల క్రితం నాలుగు బిట్ కాయిన్స్ కొన్న వారి ఆదాయం ఇప్పుడు 3.44 కోట్లు అని చెప్పవచ్చు.


సంవత్సరం బిట్‌కాయిన్ ధర (డాలర్లు)

2024 - 103,900.47 (డిసెంబర్ 5, 2024)

2023 - 16,625.08

2022 - 47,686.81

2021 - 29,374.15

2020 - 7,162.17


ఇవి కూడా చదవండి:

Bitcoin: మొదటిసారి లక్ష డాలర్లు దాటిన బిట్‌కాయిన్.. కారణమిదేనా..


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 05 , 2024 | 12:41 PM