Share News

Layoffs: పేటీఎంలో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. ఈసారి ఎంత మంది..

ABN , Publish Date - Jun 10 , 2024 | 01:04 PM

పేటీఎం(Paytm) బ్రాండ్ యజమాని అయిన ఫిన్‌టెక్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ (One 97 Communications) ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తోంది. ఈ మేరకు కంపెనీ స్వయంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నారనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

Layoffs: పేటీఎంలో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. ఈసారి ఎంత మంది..
Layoff of employees Paytm

పేటీఎం(Paytm) బ్రాండ్ యజమాని అయిన ఫిన్‌టెక్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ (One 97 Communications) ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తోంది. ఈ మేరకు కంపెనీ స్వయంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నారనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సంస్థ తన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఈ తొలగింపులను చేస్తున్నట్లు వివరించింది.

ఈ నేపథ్యంలో కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను దాదాపు 15-20 శాతం తగ్గించవచ్చని మార్చి నెలలో తెలిపింది. శ్రామికశక్తిని తగ్గించడం వల్ల 5 నుంచి 6 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరోవైపు మార్చి త్రైమాసికంలో కూడా కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 3500 మందిని తగ్గించింది.


One97 కమ్యూనికేషన్స్ (OCL) తాజా ప్రకటన ప్రకారం తొలగించబడిన ఉద్యోగులకు ఇతర కంపెనీలలో పొందడానికి HR విభాగం సహాయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అందుకోసం ఇప్పటికే దాదాపు 30 కంపెనీలను సంప్రదించినట్లు తెలిపారు. కంపెనీ రీ స్ట్రక్చరింగ్ ప్లాన్‌లో భాగంగా రాజీనామా చేసిన, చేయనున్న ఉద్యోగులకు వేరే చోట ఉద్యోగాలు కనుగొనడంలో సహాయపడుతున్నట్ల తెలిపారు. అయితే ఈ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక వల్ల ఎంత మంది ఉద్యోగులు ప్రభావితం అవుతారో కంపెనీ తెలుపలేదు. మొత్తం ప్రక్రియలో న్యాయమైన, పారదర్శకత ఉండేలా ఉద్యోగులకు అత్యుత్తమ బోనస్‌లను చెల్లిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.


Paytm మార్చి త్రైమాసిక ఫలితాల తర్వాత గత మూడు నెలల్లో కంపెనీ వర్క్‌ఫోర్స్ సుమారు 3,500 తగ్గి 36,521కి చేరుకున్నట్లు ప్రకటించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన నిషేధం ప్రభావం దీనికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. మార్చి 15 నుంచి చెల్లింపుల బ్యాంక్ లిమిటెడ్ (PPBL) డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా ఏ కస్టమర్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లకు టాప్ అప్ చేయడాన్ని RBI నిషేధించింది. దీంతో జనవరి-మార్చి త్రైమాసికంలో Paytm రూ.550 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ నష్టం రూ.167.5 కోట్లుగా ఉంది.


ఇది కూడా చదవండి:

Sensex: ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణం తర్వాత..సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డు


Gold and Silver Rate: రెండో సారి తగ్గిన బంగారం, వెండి..ఎంతకు చేరాయంటే


అప్రమత్తతే మేలు !

For Latest News and Business News click here

Updated Date - Jun 10 , 2024 | 01:05 PM