Share News

LPG Gas: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు

ABN , Publish Date - Nov 01 , 2024 | 06:51 AM

దీపావళి పండుగ వేళ చమురు కంపెనీలు షాకింగ్ న్యూస్ అనౌన్స్ చేశాయి. నవంబర్ 1న తెల్లవారుజాము నుంచే చమురు కంపెనీలు 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల రేట్లను పెంచేశాయి. అయితే ఈ మేరకు పెరిగాయి. ప్రధాన నగరాల్లో ఈ ధరలు ఎలా ఉన్నాయనే విశేషాలను ఇక్కడ చుద్దాం.

 LPG Gas: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు
LPG gas prices hike

దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాల్లో ఉన్న సామాన్యులకు షాకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే నవంబర్ 1న తెల్లవారుజాము నుంచే చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. చమురు కంపెనీలు తాజాగా విడుదల చేసిన ధరల ప్రకారం ఈ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 62 పెరిగి రూ.1802కు చేరుకుంది. అయితే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి పెంపుదల లేకపోవడం ఊరటనిచ్చే అంశం. అదే సమయంలో చమురు కంపెనీలు ATF ధరలను కూడా పెంచాయి. దీంతో విమాన ఛార్జీలు కూడా మరింత ఖరీదైనవిగా మారనున్నాయి.


ప్రధాన నగరాల్లో 19 కేజీల LPG గ్యాస్ ధరలు

  • హైదరాబాద్‌లో రూ. 2028

  • విజయవాడలో రూ. 1962

  • ఢిల్లీలో - రూ. 1802

  • కోల్‌కతాలో - రూ. 1911.50

  • ముంబైలో - రూ. 1754.50

  • చెన్నైలో - రూ. 1964.50


గృహ గ్యాస్ సిలిండర్ల ధరలు

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచిన తర్వాత, చమురు కంపెనీలు మాత్రం గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ల (14.2 కిలోల) రేట్లను మాత్రం పెంచలేదు.

కీలక నగరాల్లో 14.2 కిలోల LPG గ్యాస్ ధరలు

  • ఢిల్లీలో - రూ. 803

  • కోల్‌కతాలో - రూ. 829

  • ముంబైలో - రూ. 802.50

  • చెన్నైలో - రూ. 818.50

  • హైదరాబాద్‌లో - రూ. 855

  • విజయవాడలో - రూ. 827.50


విమాన టిక్కెట్లు కూడా..

దీపావళి సీజన్‌ తర్వాత విమాన ప్రయాణికులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. జెట్ ఇంధన ధరలను పెంచాయి. దీంతో రానున్న రోజుల్లో విమాన టిక్కెట్లు ఖరీదయ్యే అవకాశం ఉంది. నవంబర్ మొదటి తేదీ నుంచి చమురు కంపెనీలు జెట్ ఇంధనం అంటే ATF ధరలను కిలోకు 3 వేల రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

మెట్రో నగరాల్లో ATF ధరలు (డొమెస్టిక్)

  • ఢిల్లీలో రూ. 90,538.72

  • కోల్‌కతాలో రూ. 93,392.79

  • ముంబైలో రూ. 84,642.91

  • చెన్నైలో రూ. 93,957.10


ఇవి కూడా చదవండి:

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్


Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 01 , 2024 | 07:10 AM