Share News

Ola IPO: ఓలా ఐపీఓ షేర్ల ధర ఫిక్స్.. పెట్టుబడికి ఎంత కావాలంటే..

ABN , Publish Date - Jul 29 , 2024 | 02:33 PM

మదుపర్లకు ఈ వారం గుడ్ న్యూస్ వచ్చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) ఈ వారం ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఓలా ఐపీఓ(Ola Electric ipo)కు రాబోతుంది. ఇన్వెస్టర్ల కోసం ఈ ఐపీఓ ఆగస్టు 2న ప్రారంభం కానుండగా, ఆగస్టు 6 వరకు కొనసాగనుంది.

 Ola IPO: ఓలా ఐపీఓ షేర్ల ధర ఫిక్స్.. పెట్టుబడికి ఎంత కావాలంటే..
Ola IPO PRICE band shares rate

మదుపర్లకు ఈ వారం గుడ్ న్యూస్ వచ్చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) ఈ వారం ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఓలా ఐపీఓ(Ola Electric ipo)కు రాబోతుంది. ఇన్వెస్టర్ల కోసం ఈ ఐపీఓ ఆగస్టు 2న ప్రారంభం కానుండగా, ఆగస్టు 6 వరకు కొనసాగనుంది. అయితే దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.72 నుంచి రూ.76గా నిర్ణయించారు. ఈ IPOలో 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేయబడింది. ఓలా పబ్లిక్ ఇష్యూ పరిమాణం రూ.6,145.96 కోట్లు అని ప్రకటించగా, ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ దాదాపు రూ.33,500 కోట్లుగా ఉంది.


ఒక్కో షేరు ధర

కంపెనీ ఈ ఐపీఓ ధరను ఒక్కో షేరుకు రూ.72 - 76గా నిర్ణయించింది. ఈ ఐపీఓలో రూ.5,500 కోట్ల ఇష్యూ జారీ కానుంది. ఈ IPOలో తాజా ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (OFS) కూడా ఉంది. ఈ IPO ముఖ విలువ రూ.10. OFS కింద, సాఫ్ట్‌బ్యాంక్, టెమాసెక్, మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియాతో పాటు ప్రమోటర్ భావిష్ అగర్వాల్ తమ షేర్లను విక్రయిస్తారు. యాంకర్ ఇన్వెస్టర్లు ఆగస్టు 1, 2024న మాత్రమే IPOలో వేలం వేయగలరు. కంపెనీ IPO లాట్ పరిమాణాన్ని 195 షేర్లుగా నిర్ణయించారు. అంటే పెట్టుబడిదారులు కనీసం 195 ఈక్విటీ షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం గరిష్ట ధర వద్ద 14,820 రూపాయలు చెల్లించాలి. మరోవైపు అర్హులైన ఉద్యోగులకు ఆఫర్ ధరపై ఒక్కో లాట్‌పై రూ.7 తగ్గింపును కంపెనీ ప్రకటించింది.


IPO నుంచి సేకరించిన నిధుల్లో రూ.1,227 కోట్లను సెల్ తయారీ ప్లాంట్‌ను విస్తరించేందుకు ఓలా ఎలక్ట్రిక్ వినియోగించనుంది. ఇది కాకుండా IPO నుంచి సేకరించిన మొత్తాన్ని ఉత్పత్తి, అభివృద్ధి, వ్యాపార విస్తరణ, పరిశోధన కోసం కూడా ఉపయోగించనున్నారు. ఓలా ఎలక్ట్రిక్ ఎఫ్‌వై 23లో రూ.1,472 కోట్లతో పోలిస్తే, ఎఫ్‌వై24లో రూ.1,584 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. FY 24లో కంపెనీ ఆదాయంలో 90 శాతం పెరుగుదల నమోదైంది. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,630.0 కోట్ల నుంచి రూ.5,009.9 కోట్లకు పెరిగింది.


ఓలా ఐపీఓ వివరాలివే

ప్రైస్ బ్యాండ్: ఒక్కో షేరుకు రూ. 72 - 76

లాట్ సైజు: 195 ఈక్విటీ షేర్లు

IPO ప్రారంభం : ఆగస్టు 2, 2024

IPO ముగింపు: ఆగస్టు 6, 2024

ఐపీఓ కొనుగోలుకై కనిష్ట ధర వద్ద రూ.14,040 చెల్లించాలి

IPO ముఖ విలువ: రూ. 10

ఓలా IPOలో 75 శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారుల (QIP) కోసం రిజర్వ్ చేశారు. అదే సమయంలో నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం వాటా రిజర్వ్ చేయబడింది.

Paytm ఐపీఓ

మరోవైపు ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్ Paytm ఐపీఓ కూడా గతంలో భారీ అంచనాలతో వచ్చి మదుపర్లను భారీ నష్టాలను మిగిల్చింది. Paytm IPO నవంబర్ 8 నుంచి నవంబర్ 10, 2021 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రకటించగా, ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 2,080-రూ. 2,150గా నిర్ణయించారు. కానీ ప్రస్తుతం మాత్రం పేటీఎం షేర్ ధర మాత్రం రూ.496.45గా ఉంది.


ఇవి కూడా చదవండి:

Rich Stock: ఏడాదిలోనే ధనవంతులను చేసిన టాటా గ్రూప్ స్టాక్.. ఇంకా పెరగనుందా?


Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే


Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే

Read More Business News and Latest Telugu News

Updated Date - Jul 29 , 2024 | 02:41 PM