Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ABN , Publish Date - Sep 22 , 2024 | 09:51 AM
భారతదేశంలో పండుగల సీజన్ వచ్చేస్తుంది. ఈ క్రమంలో పలు ఈ కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పండుగల సీజన్ వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో దసరా, దీపావళికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అనేక మంది ప్రజలు ఇప్పటి నుంచే ఆన్‌లైన్ షాపింగ్(online shopping) చేస్తున్నారు. దీనికి తోడు ఇ కామర్స్ సంస్థలు కూడా ఇప్పటికే ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కిరాణా సామాగ్రి నుంచి మొదలుకుని బట్టలు, ఎలక్ట్రానిక్స్ వరకు ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, దీని ద్వారా మోసపోయే(online scams) ప్రమాదం కూడా ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అధికారిక వెబ్‌సైట్లలో
మీరు షాపింగ్ చేసే విషయంలో ముందుగా మీరు కొనుగోళ్లు చేసేందుకు ప్రముఖ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలి. తక్కువ రేటు ఉందని ఇతర సైట్లు ఇచ్చిన ఆఫర్లతో మోసపోవద్దు. ఎందుకంటే ఆయా సైట్లలో కొనుగోలు చేసిన తర్వాత మీకు సంబంధించిన ప్రొడక్ట్ రాకపోతే ఏం చేయాలో కూడా తెలియదు. కాబట్టి కస్టమర్ కేర్ సపోర్ట్, ప్రొడక్ట్ రిటర్న్ వంటివి ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకుని కొనుగోలు చేయాలి.
ఇమెయిల్ అలర్ట్
ఈ పండుగల సీజన్లలో సైబర్ నేరగాళ్లు మీ ఇన్‌బాక్స్‌కి ప్రత్యేక డీల్‌లను పంపించే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో ఆఫర్ లేదా డీల్స్ బాగున్నాయని మీరు దానిపై క్లిక్ చేసి మీ బ్యాంకు లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు అందిస్తే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. వీటి విషయంలో జాగ్రత్త వహించాలి.
పిన్ నంబర్‌ల వాడకం
అన్నింటి కంటే మొదటిది మీరు అన్ని పోర్టల్‌లలో ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించకూడదు. మీ పాస్‌వర్డ్ ఎప్పటికప్పుడు మార్చుతూ ఉంచండి. దీంతోపాటు మీ వ్యక్తిగత వివరాలను ఎవరితో షేర్ చేసుకోకూడదు. మీరు ఆన్‌లైన్ షాపింగ్ కోసం డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే, ప్రతి మూడు నెలలకోసారి మీ పిన్ నంబర్‌ను మార్చుకోవాలి.
యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్
ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌తో పాటు మీ స్మార్ట్‌ఫోన్‌కు కూడా యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ అవసరం. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా కొనుగోళ్లు పెరగడంతో మోసాలకు కూడా అవకాశం పెరిగింది. దీంతో నేరస్థులు మీ సిమ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వంటి వివరాలను హ్యాక్ చేసి దోచుకునే ఛాన్స్ ఉంది.
డౌన్‌లోడ్ చేసే క్రమంలో
యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు అవి Google Play Store లేదా App Store నుంచి ఉన్నాయే లేదో నిర్ధారించుకోండి. ఇటివల కాలంలో అనేక ఫేక్ యాపులను ప్లే స్టోర్ నుంచి తొలగించారు. దీంతో దుండగులు వాటికి సంబంధించిన లింకులను అనేక మంది ఫోన్లకు పంపించి డౌన్‌లౌడ్ చేసుకునే విధంగా చేస్తున్నారు. వాటిని నమ్మి డౌన్ లోడ్ చేసుకుంటే ఇబ్బందులు తప్పవు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం
Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే
Money Saving Plan: రిటైర్ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..
Read MoreBusiness News and Latest Telugu News