Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..
ABN, Publish Date - Dec 22 , 2024 | 05:11 PM
మీ డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారం ఆన్‌లైన్‌లో చోరీ అవుతుందా జాగ్రత్త. మీరు మీ కార్డ్ వివరాలను ఉపయోగించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉపయోగించాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
గత కొన్నేళ్లుగా ప్రధానంగా డీమోనిటైజేషన్ తర్వాత, క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో అనేక మంది భారతీయులు తమ కొనుగోళ్ల కోసం పాయింట్ ఆఫ్ సేల్స్ (PoS) వద్ద లావాదేవీలు చేస్తున్నప్పుడు ఆయా కార్డ్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే ఇటివల కాలంలో సైబర్ మోసాలు పెరగడం వల్ల, వీటి ఉపయోగం విషయంలో కూడా జాగ్రత్త అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీటి వాడకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
1. కోడ్ విషయంలో
మీరు మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని పొందిన వెంటనే, మీరు చేయవలసిన మొదటి పని మీ రహస్య పిన్ నంబర్‌ను గుర్తుంచుకోవడం. ఆ తర్వాత మీ రహస్య పిన్ నంబర్ ఉన్న డాక్యుమెంట్‌ను చింపియాలి. ఆ తర్వాత మీ సౌలభ్యం ప్రకారం మీ పిన్ నంబర్‌ను మార్చుకోవాలి. అయితే దానిని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఆ రహస్య పిన్ నంబర్‌ను ఎక్కడా కూడా రాసి ఉంచుకోవద్దు.
2. బిల్లులు చెల్లించే విషయంలో..
మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుకు సంబంధించిన అన్ని వివరాలను తప్పనిసరిగా రహస్యంగా ఉంచుకోవాలి. కార్డ్ నంబర్, గడువు తేదీ, కార్డ్ హోల్డర్ పేరు, పిన్ నంబర్, కార్డ్ ధృవీకరణ (CVV) నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను ఎవరికీ బహిర్గతం చేయవద్దు. ప్రత్యేకించి మీరు మీ కార్డ్‌ని పబ్లిక్ ప్లేస్‌లో PoS లేదా ATMలో ఉపయోగిస్తున్నప్పుడు మీ పిన్ నంబర్‌ని టైప్ చేసే క్రమంలో ఎవరైనా చుస్తున్నారో పరిశీలించాలి. అలాంటి వారు ఉండే మీ డేటా చోరీ అయ్యే ఛాన్స్ ఉంది. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. పెట్రోల్ పంపులు లేదా రెస్టారెంట్లలో బిల్లులు చెల్లిస్తున్నప్పుడు కూడా కార్డ్ వినియోగించే విషయంలో జాగ్రత్తగా వహించాలి.
3. కార్డ్ వివరాలు ఫోన్‌లో షేర్ చేయోద్దు
మీ కార్డ్ వివరాలను ఎవరైనా తెలియని వ్యక్తులు అడిగితే ప్రశ్నలకు సమాధానం చెప్పొద్దు. కాలర్ ఎంత విశ్వసనీయంగా కనిపించినా, మీ కార్డ్ నంబర్, పాస్‌వర్డ్, CVV, PIN, OTP వంటి వివరాలను వారితో ఎప్పుడూ షేర్ చేయోద్దు. దీంతోపాటు ఫోన్ కాల్ సమయంలో లేదా సోషల్ చాట్ మొబైల్ యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు మీ ఆర్థిక వివరాలను దగ్గరి బంధువులతో పంచుకోకూడదు. పొరపాటున కూడా ఇలాంటి పొరపాటు చేస్తే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
4. చిప్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించండి
ప్రస్తుతం భారతదేశంలో అన్ని కొత్త డెబిట్, క్రెడిట్ కార్డ్‌లలో చిప్‌లు ఉన్నాయి. ఈ కొత్త కార్డ్‌లు పాత కార్డ్‌ల కంటే సురక్షితమైనవి. ఎందుకంటే పాత కార్డ్‌లు వెనుక భాగంలో మాగ్నెటిక్ స్ట్రిప్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పటికీ చిప్ లేకుండా పాత కార్డ్‌లను ఉపయోగిస్తుంటే వాటిని అప్‌గ్రేడ్ చేయమని మీ బ్యాంక్‌ని అడగడం మంచిది.
5. చెల్లింపు చేసేటప్పుడు జాగ్రత్త
మీ డిజిటల్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవడం ఎల్లప్పుడూ ముఖ్యం. కాబట్టి ఆన్‌లైన్ చెల్లింపులు సురక్షితమైన వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే చేయాలి. SSL ధృవీకరణ ఉన్న వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే లావాదేవీలు జరపండి. మీ కార్డ్ వివరాలను ఏ వెబ్‌సైట్ లేదా బ్రౌజర్‌లో సేవ్ చేయకూడదు. అనేక ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు మీ తదుపరి లావాదేవీ సమయంలో చెల్లింపులను సులభతరం చేయడానికి మీ కార్డ్ డేటాను సేవ్ చేసుకోవాలని సిఫార్సు చేస్తాయి. కానీ అలాంటి వాటిని పట్టించుకోవద్దు. ఆన్‌లైన్ లావాదేవీలు జరిపినప్పుడు ఆ లావాదేవీకి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఉంచుకోండి. తర్వాత ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఇది మీకు సహాయకారిగా ఉంటుంది.
6. మీ కార్డ్ స్టేట్‌మెంట్‌లు, లావాదేవీలపై నిఘా ఉంచండి
మీరు మీ కార్డ్ స్టేట్‌మెంట్‌లు లేదా లావాదేవీలను కనీసం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తనిఖీ చేసుకోవాలి. మీరు ఏదైనా సరిపోలని లేదా తెలియని లావాదేవీని గమనించినట్లయితే వెంటనే కార్డ్ కంపెనీకి తెలియజేయండి. ఆ క్రమంలో మీరు క్రెడిట్ కార్డ్ మోసానికి గురైనట్లయితే అనిపిస్తే వెంటనే మీ కార్డ్ కంపెనీ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి, సంఘటన గురించి తెలపండి. వారు వెంటనే మీ కార్డ్‌ని బ్లాక్ చేస్తారు. తద్వారా మీ కార్డ్‌ని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని కంపెనీలంటే..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 22 , 2024 | 05:14 PM