ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Markets: హిండెన్‌బర్గ్ ఆరోపణల మధ్య ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

ABN, Publish Date - Aug 12 , 2024 | 05:26 PM

హిండెన్‌బర్గ్(Hindenburg) ఆరోపణల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికాకు చెందిన రీసెర్చ్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ హిండెన్‌బర్గ్.. సెబీ చైర్‌పర్సన్‌పై ఆరోపణలు చేయడంతో ఇవాళ్టి మార్కెట్లు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రారంభమయ్యాయి.

ఇంటర్నెట్ డెస్క్: హిండెన్‌బర్గ్(Hindenburg) ఆరోపణల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికాకు చెందిన రీసెర్చ్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ హిండెన్‌బర్గ్.. సెబీ చైర్‌పర్సన్‌పై ఆరోపణలు చేయడంతో ఇవాళ్టి మార్కెట్లు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రారంభమయ్యాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ ఖండించారు.

సెన్సెక్స్ పయనమిలా..

సెన్సెక్స్‌ ఉదయం 79,330.12 పాయింట్ల (క్రితం ముగింపు 79,705.91) వద్ద నష్టాల్లో స్టార్ట్ అయింది. ఇంట్రాడేలో దాదాపు 500 పాయింట్ల మేర నష్టాల్లోకి జారుకున్న సూచీ, 79,226.13 వద్ద కనిష్ఠాన్ని తాకి.. ఆ తర్వాత కోలుకుని లాభాల్లోకి వచ్చింది. 80,106 పాయింట్ల గరిష్ఠాన్ని చేరుకోగా.. 56.99 పాయింట్ల నష్టంతో చివరికి 79,648.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 20.50 పాయింట్ల నష్టంతో 24 వేల 347 వద్ద స్థిరపడింది. ఒక డాలరు విలువ 83.96 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్ బ్యారెల్‌ ధర 80.36 డాలర్ల వద్ద ఉండగా.. బంగారం ఔన్సు 2,482 డాలర్ల వద్ద కొనసాగుతోంది.


కోలుకున్న అదానీ షేర్లు..

హిండెన్‌బర్గ్ ఆరోపణల తరువాత స్వల్ప కుదుపులకు లోనైన అదానీ గ్రూప్ షేర్లు ఇవాళ స్వల్పంగా కోలుకున్నాయి. బలహీనమైన ప్రారంభం తర్వాత, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు గ్రీన్‌లో ముగియడంతో అదానీ గ్రూప్ స్టాక్స్ కనిష్ట స్థాయి నుంచి కోలుకున్నాయి. అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్ గరిష్ఠంగా 4.2 శాతం మేర నష్టపోయాయి. కాగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ 0.7 శాతం మేర లాభపడ్డాయి.

  • హిండెన్‌బర్గ్ కారణంగా నిఫ్టీ 24 వేల 400ని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాల్లో నడవగా.. ఎన్టీపీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నష్టపోయాయి.


  • బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది.

  • ఇటీవలే ఐపీవోకెక్కిన ఓలా ఎలక్ట్రిక్‌ షేర్లు ఇవాళ పరుగులు తీశాయి. ఏకంగా 19.99 శాతం లాభంతో రూ.109.41 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద ముగిశాయి. శుక్రవారం ఓలా ఎలక్ట్రిక్‌ షేరు రూ.91.18 వద్ద ముగిసిన విషయం విదితమే.

  • ఎఫ్‌ఎంసీజీ, పవర్, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా షేర్లు 0.5 - 2 శాతం క్షీణించగా, బ్యాంక్, టెలికాం, ఐటీ, ఆయిల్ & గ్యాస్, మెటల్, రియల్టీ 0.3-1 శాతం చొప్పున పెరిగాయి.

  • వోల్టాస్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, ఆయిల్ ఇండియా, అజంతా ఫార్మా, గ్లెన్‌మార్క్ ఫార్మా, కోరమాండల్ ఇంటర్నేషనల్, లుపిన్, ముత్తూట్ ఫైనాన్స్, కోల్గేట్ పామోలివ్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్, ఐనాక్స్ ఓ విండ్, జిటోమోవర్స్ ఫార్మాస్యూటికల్స్‌తో సహా బీఎస్‌ఈలో దాదాపు 280 స్టాక్‌లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి.

  • బెంచ్‌మార్క్ సూచీలు అస్థిర ట్రేడింగ్ సెషన్‌ను చూశాయి. నిఫ్టీ 21 పాయింట్లు దిగువన ముగియగా, సెన్సెక్స్ 57 పాయింట్లు పడిపోయింది. సెక్టార్లలో రియాలిటీ ఇండెక్స్ 1.35 శాతానికి పైగా ర్యాలీ చేయగా, మీడియా ఇండెక్స్ దాదాపు 2 శాతం క్షీణించింది.

Updated Date - Aug 12 , 2024 | 05:30 PM

Advertising
Advertising
<