ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. సూచీల పతనానికి కారణమిదే..

ABN, Publish Date - Dec 13 , 2024 | 11:28 AM

Stock Market: స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. పలు కారణాల వల్ల మార్కెట్లు నష్టాల బాటలో నడుస్తున్నాయి. అసలు సూచీల పతనానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

Stock Markets

Stock Market Updates: స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. పలు కారణాల వల్ల మార్కెట్లు నష్టాల బాటలో నడుస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం నుంచి నష్టాల్లోనే ట్రెండ్ అవుతున్నాయి. పొద్దున 9.46 గంటల సమయానికి నిఫ్టీ 161 పాయింట్లు నష్టపోయి 24,382కు చేరింది. సెన్సెక్స్ అయితే ఏకంగా 581 పాయింట్లు దిగజారి 80 వేల 688 దగ్గర ట్రేడ్ అవుతోంది. అమెరికా స్టాక్ మార్కెట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 106.9 పాయింట్ల వద్దకు చేరుకుంది.


రీజన్స్ ఇవే..

అమెరికాలో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 73.5 డాలర్లుగా ఉంది. అక్కడి పదేళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.32 శాతానికి చేరుకున్నాయి. యూఎస్ మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.54 శాతం, నాస్‌డాక్ 0.66 శాతం దిగజారాయి. కాగా, దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి పలు కారణాలు చెబుతున్నారు బిజినెస్ అనలిస్టులు. గత వారం రోజుల నుంచి మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయని అంటున్నారు. మూమెంటమ్ రాకపోవడంతో నష్టాలు తప్పలేదని చెబుతున్నారు. ఒకవైపు డాలర్‌ వాల్యూ పెరగడం, మరోవైపు రూపాయి విలువ బలహీనపడటం, రూ.85 వరకు వెళ్లిపోయే అవకాశం ఉండటం కారణాలని చెబుతున్నారు. జీడీపీ తగ్గడం, ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించకపోవడం కూడా మార్కెట్ మీద ప్రభావం చూపిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


Also Read:

గబ్బా ఫైట్‌కు అంతా రెడీ.. 2 కీలక మార్పులతో బరిలోకి టీమిండియా

ఆసీస్ టీమ్‌లోకి డేంజరస్ ప్లేయర్.. కమిన్స్ గట్టి ప్లానింగే

సెంచరీ కొట్టినా భారత్‌కు భయపడుతున్న హెడ్

For More Sports And Telugu News

Updated Date - Dec 13 , 2024 | 11:28 AM