Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!
ABN , Publish Date - Aug 03 , 2024 | 09:42 PM
ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఎవరికి కూడా ఎక్కువ సమయం ఉండటం లేదు. ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో బిజిబిజీగా గడుపుతున్నారు. ఇలాంటి క్రమంలో ఇంట్లో పెళ్లి(marriage) లాంటి కార్యక్రమం చేయాలంటే అన్నింటికి ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నింటిని చేసే వ్యక్తినే వెడ్డింగ్ ప్లానర్(Wedding planner ) అంటారు. అయితే ఈ వ్యాపారం నిర్వహిస్తే లాభాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఎవరికి కూడా ఎక్కువ సమయం ఉండటం లేదు. ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో బిజిబిజీగా గడుపుతున్నారు. ఇలాంటి క్రమంలో ఇంట్లో పెళ్లి(marriage) లాంటి కార్యక్రమం చేయాలంటే అన్నింటికీ ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ఇటివల కాలంలో పెళ్లిళ్ల నిర్వహణ ప్రొఫెషనల్స్ ద్వారా చేయించుకోవడం కూడా మొదలైంది. దీంతో పెళ్లి చూపుల తర్వాత జరిగే కార్యక్రమాల నుంచి పెళ్లి జరిగి అప్పగింతలు పూర్తయ్యే వరకు కూడా అన్ని కార్యక్రమాలు కూడా వారే సమకూరుస్తున్నారు. ఆ క్రమంలో భోజనం, అలంకరణ, వేదిక, ఫోటోలు, వీడియోలు సహా అనేకం వారే సమకూరుస్తారు. అయితే ఈ ఏర్పాట్లన్నింటిని చేసే వ్యక్తినే వెడ్డింగ్ ప్లానర్(Wedding planner ) అంటారు. పెళ్లిళ్ల సీజన్లలో వీరికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.
కస్టమర్ నుంచి
అయితే దీని కోసం ఎలాంటి స్కిల్స్(skills) ఉండాలి. ఎలాంటి పనులు నిర్వహించాల్సి ఉంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి నిర్వహణకు మీకు ఒక నాలుగురు లేదా ఐదుగురి బృందం అవసరం. మీరొక్కరే పెళ్లి వేడుకలను మొత్తం చూసుకోలేరు. అయితే వారిని పెళ్లి తేదీలను బట్టి రోజువారీగా కూడా తీసుకోవచ్చు. అయితే పెళ్లి నిర్వహణ కోసం కస్టమర్ నుంచి ముందుగా సగం మొత్తం అడ్వాన్స్ తీసుకుని అందులోనుంచే మీరు ఖర్చు చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన పని ఉండదు.
సౌకర్యాలను
అయితే పెళ్లి నిర్వహణ ఆర్డర్ మీకు వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి కార్యక్రమం ఖర్చులు, సిబ్బందిని అంచనా వేసుకుని పూర్తి చేయాలి. ఫుడ్, వెయిటర్లు, టెంట్లు మొదలైన ప్రాథమిక వివాహ సౌకర్యాలను అందించాలి. అదే సమయంలో మొత్తం పెళ్లిలో ప్రతి చిన్న పనిని నిర్వహించాల్సి ఉంటుంది. దీంతోపాటు కస్టమర్లకు నచ్చిన అంశాలు తెలుసుకుని వారి అభిరుచులకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తే మీరు మరింత మెప్పు పొందే అవకాశం ఉంటుంది.
పనిచేసినా కూడా
ఈ వ్యాపారం గురించి మాకు ఏమి తెలియదనుకుంటే మీరు వివాహ ప్రణాళిక(Wedding plan)లో కోర్సు లేదా డిప్లొమా కూడా చేయవచ్చు. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. లేదంటే మీరు వెడ్డింగ్ ప్లానర్ కంపెనీతో పని చేయడం ద్వారా కూడా అనుభవాన్ని పొందవచ్చు. ఏదైనా సంస్థ ఆధ్వర్యంలో పనిచేసినా కూడా మీకు ఏడాదికి 12 లక్షల వరకు వేతనం ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరే పెళ్లి మొత్తం కాంట్రాక్టు తీసుకుని నిర్వహిస్తే ఖర్చులు పోను ప్రతి పెళ్లికి కనీసం 5 నుంచి 10 లక్షల సంపాదించే అవకాశం ఉంటుంది. మీరు మీ మొదటి పెళ్లిని విజయం వంతంగా నిర్వహించిన తర్వాత మీకు ఒక అనుభవం వస్తుంది. ఆ తర్వాత మీ వ్యాపారం గురించి అనేక మందికి తెలియజేయాలి. అలా ఇంకొన్ని మంచి ఆర్డర్లు నిర్వహిస్తే మీరు ఏడాదిలోనే కోటిశ్వరులు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Jeff Bezos: అమెజాన్ జెఫ్ బెజోస్‌కు భారీ దెబ్బ.. ఎలాన్ మస్క్, అంబానీ మనీ కూడా..
ITR Filing: జరిమానాతో ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఇన్ని నష్టాలున్నాయా..!
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News