Andhra Pradesh: టాయిలెట్‌కు వెళ్తున్న అమ్మాయిలు.. చెట్టుపై నుంచి..
ABN, Publish Date - Dec 22 , 2024 | 10:22 AM
ఎటు పోతోంది సమాజం.. మన ఇళ్లల్లోనూ ఆడపిల్లలు ఉంటారన్న సోయి లేకుండా పోతోంది కొందరు మగాళ్లలో. మనమూ ఒక అమ్మకు పుట్టినోళ్లమనే రెస్పెక్ట్ లేకుండా పోతోంది.
ఎటు పోతోంది సమాజం.. మన ఇళ్లల్లోనూ ఆడపిల్లలు ఉంటారన్న సోయి లేకుండా పోతోంది కొందరు మగాళ్లలో. మనమూ ఒక అమ్మకు పుట్టినోళ్లమనే రెస్పెక్ట్ లేకుండా పోతోంది. పరాయి స్త్రీ కనిపిస్తే చాలు కామంతో కన్నూ మిన్ను కానక వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లలను కూడా వదలడం లేదు కొందరు నీచులు. తాజాగా ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ద్వారకాతిరుమల మండలం, పంగిడిగూడెం జిల్లా పరిషత్ స్కూల్‌లో కొందరు నీచులు చిల్లర పనులు చేశారు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా వాళ్లు చేసిన పని? వ్యవహరించిన తీరు చూస్తే ఎవ్వరికైనా కోపం కట్టలు తెంచుకోవాల్సిందే. ఛీ.. ఛీ.. వీళ్లు చేసిన పని తెలిస్తే సమాజం ఎటు పోతుందో అని అనకమానరు. ఇలాంటి వ్యక్తులతో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసొస్తుంది. అసలేం జరిగింది? అనేది ఇప్పుడు చూద్దాం..
వాళ్ల పనే!
ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం జెడ్పీ హైస్కూల్లో టాయిలెట్‌కు వెళ్తున్న విద్యార్థినుల ఫోటోలు తీశారు ఆకతాయిలు. చెట్టు పైకి ఎక్కిన నీచులు.. విద్యార్థినులు టాయ్‌లెట్‌కు వెళ్తుండగా సెల్ ఫోన్‌లో ఫొటోలు తీశారు. అది గమనించిన విద్యార్థినులు.. ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. దీంతో ఆకతాయిలను పట్టుకునేందుకు టీచర్లు వెంబడించారు. వారిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ తప్పించుకున్నారు. టాయ్‌లెట్ ఘటన గురించి తెలుసుకున్న స్టూడెంట్స్ పేరెంట్స్ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది పాఠశాల విద్యా కమిటీ. వేంపాడు గ్రామానికి చెందిన వ్యక్తులను విద్యార్థినుల ఫొటోలు తీసిన వారిగా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలిసిన వాళ్లు.. ఆ నీచులను అస్సలు వదలొద్దు అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:
కాల్పుల కలకలం..ఉలిక్కిపడిన అన్నమయ్య జిల్లా
కాలినడకన ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు...
వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ రాజీనామా చేయించాలి
For More Crime And Telugu News
Updated Date - Dec 22 , 2024 | 10:25 AM