ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhuvanagiri: దైవ దర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..

ABN, Publish Date - Dec 26 , 2024 | 07:05 AM

మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. బుధవారం యాదాద్రి- భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి(Bhuvanagiri)లో ఈ ఘటన చోటు చేసుకుంది.

- చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

- యాదాద్రి - భువనగిరి జిల్లాలో ఘటన

భువనగిరి: మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. బుధవారం యాదాద్రి- భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి(Bhuvanagiri)లో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణ ఎస్‌ఐ కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ రామంతపూర్‌(Hyderabad Ramanthapur)కు చెందిన ఇంటర్‌ చదువుతున్న ఆరుగురు విద్యార్థులు బుధవారం ఉదయం కారులో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అరుదైన తాబేళ్లను విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌..


మధ్యాహ్నం 2గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. కారు భువనగిరి బైపాస్‌ రోడ్డు టీచర్స్‌ కాలనీ అండర్‌పాస్‌ బ్రిడ్జిపై అదుపుతప్పి పల్టీలు కొడుతూ చెట్టును ఢీకొట్టింది. దీంతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి తేరాల యశ్వంత్‌(17), డ్రైవర్‌ అబ్దుల్‌ సుఫియాన్‌(35) అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులు శ్రీను, సకీబ్‌ తీవ్రంగా గాయపడటంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.


విద్యార్థులు అర్జున్‌, నితీష్‌, మణిజయంత్‌కు స్వల్పగాయాలు కాగా, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. బోల్తా పడిన కారు చెట్టును ఢీకొని నిలిచిపోగా, కారు డోర్లను పగులగొట్టి అందులోని మృతదేహాలను వెలికితీశారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులు నిజమే

ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్‌ డీపీ మార్చి.. మెసేజ్‌ పంపి..

ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2024 | 07:05 AM