Cyber criminals: కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ‘సైబర్’ వల.. రూ.1.32 లక్షలు గోవిందా..
ABN, Publish Date - Nov 26 , 2024 | 08:24 AM
కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా నిధులు మంజూరయ్యాయని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.1.32 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి(33)కి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి తాము జనరల్ బ్యాంకు అధికారులమని పరిచయం చేసుకున్నారు.
- రూ.1.32 లక్షలు మోసపోయిన వ్యక్తి
హైదరాబాద్ సిటీ: కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా నిధులు మంజూరయ్యాయని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.1.32 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి(33)కి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి తాము జనరల్ బ్యాంకు అధికారులమని పరిచయం చేసుకున్నారు. తమ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులు విడుదలవుతాయని, మీ పేరున ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రాం(Prime Minister's Employment Generation Program) కింద 30 శాతం రాయితీతో రూ.5 లక్షల రుణం మంజూరైందంటూ పత్రాలు చూపారు.
ఈ వార్తను కూడా చదవండి: R. Krishnaiah: అవసరమైతే రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధం..
ఈ రుణానికి సంబంధిచి ప్రతి నెలా రూ.5,480 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. బ్యాంకు చార్జీలు, ఇన్సూరెన్స్, డీడీ చలాన్ చార్జీలు, రిఫండబుల్ ఎమౌంట్ మొత్తం కలిపి రూ.1,32,510 చెల్లిస్తే, రూ.5 లక్షలకు ఈ మొత్తం కలిపి చెక్కు రూపంలో ఇంటికి వస్తుందని నమ్మబలికారు. వీరి మాటలు నమ్మిన బాధితుడు వారి ఖాతాలో డబ్బు జమ చేశాడు. ఎన్ని రోజులు వేచి చూసినా చెక్కు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈవార్తను కూడా చదవండి: Shamshabad: బ్యాంకాక్ నుంచి బ్యాగుల్లో పాములు
ఈవార్తను కూడా చదవండి: Goshmahal: మలక్‌పేటకు గోషామహల్ స్టేడియం
ఈవార్తను కూడా చదవండి: Solar Panels: సోలార్ ప్యానల్స్‌తో మేలుకన్నా హాని ఎక్కువ
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 26 , 2024 | 08:24 AM