Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్‌ను చంపేస్తానని బెదిరించిన సైబర్ నేరగాడి అరెస్ట్
ABN, Publish Date - Jun 12 , 2024 | 10:08 AM
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Rajasingh)కు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(వీవోఐపీ) ద్వారా ఫోన్‌లు చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ.. చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన సైబర్ నేరగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు(City Cybercrime Police) అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ సిటీ: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Rajasingh)కు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(వీవోఐపీ) ద్వారా ఫోన్‌లు చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ.. చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన సైబర్ నేరగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు(City Cybercrime Police) అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట ఫైల్‌బాగ్‌కు చెందిన మహ్మద్ వసీం(Mohammad Wasim) సౌదీ అరేబియా జెడ్డాలో డ్రైవర్. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజాసింగ్‌కు వీవోఐపీ అప్లికేషన్ ద్వారా ఫోన్‌లు చేసి అసభ్య పదాలతో తిట్టాడు. ఎన్నికల లెక్కింపురోజు నీతో పాటు నీ కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నామని హెచ్చరించాడు.
ఇదికూడా చదవండి: Hyderabad: వాహనాల చోరీ.. ఓఎల్‌ఎక్స్‌లో విక్రయం..
దాంతో రాజాసింగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన సైబర్‌క్రైమ్ బృందం టెక్నికల్ ఎవిడెన్స్‌ను సేకరించి నిందితుడు సౌదీ అరేబియా నుంచి వీవోఐపీ ద్వారా కాల్స్ చేస్తున్నట్లు గుర్తించారు. లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. నిందితుడు మహ్మద్ వసీం మంగళవారం సౌదీ నుంచి హైదరాబాద్‌కు విమానంలో చేరుకున్నాడు. అతడిపై లుక్ అవుట్ నోటీస్ ఉండడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. వెంటనే సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ సైదులు బృందం నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించారు. అతడి నుంచి బెదిరింపులకు వినియోగించిన సిమ్‌కార్డులతో పాటు.. ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 12 , 2024 | 10:10 AM