Share News

Hyderabad: క్రిమినల్‌ కేసుల్లో గచ్చిబౌలి టాప్‌.. ఐటీ కారిడార్‌లో పెరుగుతున్న నేరాలు

ABN , Publish Date - Oct 22 , 2024 | 08:32 AM

ఐటీ సంస్థలకు కేరా్‌ఫగా నిలిచిన సైబరాబాద్‌ కమిషనరేట్‌(Cyberabad Commissionerate) పరిధి కేసుల నమోదులో తెలంగాణలోనే ప్రథమస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయి.

Hyderabad: క్రిమినల్‌ కేసుల్లో గచ్చిబౌలి టాప్‌.. ఐటీ కారిడార్‌లో పెరుగుతున్న నేరాలు

- పోలీసులపై పెరుగుతున్న పని భారం

- కొత్త పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుకు కసరత్తు

హైదరాబాద్‌ సిటీ: ఐటీ సంస్థలకు కేరా్‌ఫగా నిలిచిన సైబరాబాద్‌ కమిషనరేట్‌(Cyberabad Commissionerate) పరిధి కేసుల నమోదులో తెలంగాణలోనే ప్రథమస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నమోదైన క్రిమినల్‌ కేసుల్లో సైబరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌(Gachibowli Police Station) టాప్‌లో నిలిచింది. ఈ ఏడాదిలో 1,562 కేసుల నమోదుతో గతేడాది మొత్తం నమోదైన కేసులను (1472) దాటేసింది. గచ్చిబౌలి తర్వాత నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 1,515 కేసులు, మాదాపూర్‌లో 1360 కేసులు నమోదయ్యాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రెండో అంతస్తు నుంచి అమ్మమ్మను తోసేశాడు..


ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో జనాభా పెరగడంతో పాటు, బాధితులు ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు నమోదవుతున్న కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. గతంలో పోలీసు అధికారులు, ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా పరిష్కారానికి ప్రయత్నించేవారు. సైబరాబాద్‌(Cyberabad) పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్లలో కేసుల సంఖ్య పెరగడంతో సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది.


ఈమేరకు పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కేసుల నమోదులో సైబరాబాద్‌ తర్వాత రాచకొండ కమిషనరేట్‌లోని ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ పోలీస్ స్టేషన్‌లు నిలిచాయి. ఈ ఏడాదిలో ఉప్పల్‌ పోలీస్ స్టేషన్‌(Uppal Police Station)లో 1,350 కేసులు, ఎల్‌బీనగర్‌ పోలీస్ స్టేషన్‌లో 1,100 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పంజాగుట్ట, బంజారాహిల్స్‌ పోలీస్టేషన్‌లలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.


గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యేవి. కొత్తగా ఖైరతాబాద్‌, మధురానగర్‌ స్టేషన్‌లు ఏర్పాటు కావడంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌(Panjagutta Police Station)పై ఒత్తిడి తగ్గింది. ఇదే విధంగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని గచ్చిబౌలి, నార్సింగ్‌, ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో కొత్త స్టేషన్‌ల ఏర్పాటు ద్వారా కేసుల త్వరితగతిన పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2024 | 08:32 AM