ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మియాపూర్‌లో మిస్సింగ్‌.. పెద్దాపురంలో ప్రత్యక్షం

ABN, Publish Date - Nov 14 , 2024 | 09:24 AM

అల్లూరి సీతారామరాజు(Alluri Seetharama Raju) జిల్లా జడ్డంగి గ్రామానికి చెందిన కొత్త ఆనంద్‌ హైదరాబాద్‌(Hyderabad) నగరంలో మియాపూర్‌ ప్రాంతంలోని ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థలో పనిచేస్తున్నాడు. సమీప ఇంటిలో నివాసముంటున్న ఓ పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.

- మాయమాటలు చెప్పి తీసుకువచ్చిన యువకుడు

- అద్దె ఇంట్లో బాలికను నిర్బంధించి..

- అర్ధరాత్రి రక్షించిన పోలీసులు

పదేళ్ల బాలికను బలవంతంగా తీసుకువచ్చి స్థానికంగా ఓ ఇంట్లో నిర్బంధించిన సంఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలోని పరదేశమ్మ కాలనీలో జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వి.మౌనిక తన సిబ్బందితో చేరుకుని బాలికను నిర్బంధించిన ఇంటి తలుపులు బద్దలుకొట్టి బాలికను కాపాడారు.

పెద్దాపురం, హైదరాబాద్: అల్లూరి సీతారామరాజు(Alluri Seetharama Raju) జిల్లా జడ్డంగి గ్రామానికి చెందిన కొత్త ఆనంద్‌ హైదరాబాద్‌(Hyderabad) నగరంలో మియాపూర్‌ ప్రాంతంలోని ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థలో పనిచేస్తున్నాడు. సమీప ఇంటిలో నివాసముంటున్న ఓ పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: రూ.16లక్షల విలువ గల హాష్‌ ఆయిల్‌ పట్టివేత


ఆ బాలికను పెద్దాపురం పట్టణానికి మంగళవారం రాత్రి తీసుకువచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నిర్బంధించాడు. పెద్దాపురంలో బాలిక, ఆ యువకుడు ఎక్కిన ఆటో డ్రైవర్‌కు వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి పెద్దాపురం పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మౌనిక తన సిబ్బందితో అక్కడకు చేరుకుని, ఇంటి తలుపులు బద్దలు కొట్టి బాలికను రక్షించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు(Peddapuram DSP D. Srihari Raju) బాలిక నుంచి వివరాలను సేకరించారు.


బాలిక తల్లిదండ్రులు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో నివాసం ఉండేవారని, పొట్టకూటికోసం మియాపూర్‌లో ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే మియాపూర్‌ పోలీస్ స్టేషన్‌(Miyapur Police Station)లో బాలిక కిడ్నా్‌పపై మిస్సింగ్‌ కేసు నమోదైనట్టు తెలుసుకున్నారు. బాలికను యువకుడు ఇంట్లో నిర్బంధిస్తే ఇల్లు అద్దెకు ఇచ్చినవారికి తెలియలేదా అని వారిపై డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికను, యువకుడిని స్టేషన్‌కు తరలించి వివరాలను సేకరించారు. బాలిక బంధువులకు సమాచారం తెలియజేశారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: కొడంగల్‌ నుంచే రేవంత్‌ భరతం పడతాం

ఈవార్తను కూడా చదవండి: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం

ఈవార్తను కూడా చదవండి: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2024 | 09:24 AM