ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: తనను కాదని.. మరొకరితో చనువుగా ఉంటోందని..

ABN, Publish Date - Jul 02 , 2024 | 11:06 AM

వారిద్దరూ ఓ రియల్‌ ఎస్టేట్‌(Real estate) సంస్థలో పని చేస్తున్నారు. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఆ మహిళ కొద్దిరోజులుగా మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని ఘర్షణ పడుతున్నాడు. వివాదం పరిష్కరించుకుందామని పిలిచి.. మహిళను దారుణంగా హత్య చేశాడు.

- మాట్లాడుకుందామని పిలిచి మట్టుబెట్టాడు!

- కారుతో గుద్ది ప్రమాదంగా చిత్రీకరించే యత్నం

- ఉప్పల్‌ భగాయత్‌లో దారుణ హత్య

హైదరాబాద్: వారిద్దరూ ఓ రియల్‌ ఎస్టేట్‌(Real estate) సంస్థలో పని చేస్తున్నారు. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఆ మహిళ కొద్దిరోజులుగా మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని ఘర్షణ పడుతున్నాడు. వివాదం పరిష్కరించుకుందామని పిలిచి.. మహిళను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి ఉప్పల్‌ భగాయత్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్‌ డివిజన్‌(Ramanthapur Division) వివేక్‌నగర్‌లో ఉంటున్న మహిళ (45) భర్త చనిపోవడంతో నాగోల్‌ సమీపంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ఏజెంట్‌గా పనిచేస్తోంది. అదే సంస్థ ఏజెంట్‌ చంద్రమౌళి(47)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని చంద్రమౌళి అనుమానం పెంచుకున్నాడు. ఆ విషయమై మాట్లాడుకుందామని, ఉప్పల్‌ భగాయత్‌కు రావాలని ఆమెను పిలిచాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: 4న సింగూరు జలాలు బంద్‌..


అక్కడికి వచ్చాక ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అక్కడి నుంచి వెనుదిరుగుతున్న ఆమెను చంద్రమౌళి కారుతో ఢీకొట్టి, ఆమెపైకి కారును ఎక్కించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. రక్తపుమడుగులో ఉన్న ఆమెను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంతలో నిందితుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని యాక్సిడెంట్‌ గురించి చెప్పాడు. అనుమానంతో తమదైన శైలిలో విచారించగా, తానే హత్య చేశానని లొంగిపోయాడు. ఆ మహిళకు కుమార్తె (19), పదో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. ఉప్పల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 11:06 AM

Advertising
Advertising