ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆ అన్నదమ్ములు.. స్మగ్లర్లు

ABN, Publish Date - Aug 13 , 2024 | 08:41 AM

ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్‌) నుంచి బెంగళూరుకు హాష్‌ ఆయిల్‌(Hash oil) స్మగ్లింగ్‌ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 13.5 కేజీల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.14కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

- ఏవోబీ నుంచి బెంగళూరుకు హాష్‌ ఆయిల్‌ సరఫరా

- నిఘా పెట్టి పట్టుకున్న రాచకొండ పోలీసులు

- 13.5ల కేజీల హాష్‌ ఆయిల్‌ పట్టివేత

- బహిరంగ మార్కెట్లో రూ. 14 కోట్ల విలువ

హైదరాబాద్‌ సిటీ: ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్‌) నుంచి బెంగళూరుకు హాష్‌ ఆయిల్‌(Hash oil) స్మగ్లింగ్‌ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 13.5 కేజీల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.14కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ సుధీర్‌బాబు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

ఇదికూడా చదవండి: High Court: మేడిగడ్డపై డ్రోన్‌ ఎగరేసిన కేసులో కేటీఆర్‌కు ఊరట


విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం అలగామ్‌ ప్రాంతానికి చెందిన వంచుర్బ కొండబాబు వ్యవసాయం చేస్తుంటాడు. అతను తరచుగా అల్లూరి సీతారామరాజు జిల్లా అన్నవరం పశువుల సంతకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఏవోబీకి చెందిన వ్యక్తి అతడికి పరిచయం అయ్యాడు. అతనికి గంజాయి, హాష్‌ ఆయిల్‌ స్మగ్లింగ్‌ వల్ల వచ్చే అధిక ఆదాయం గురించి కొండబాబుకు చెప్పాడు. మంచి అవకాశంగా భావించిన కొండబాబు అన్నవరంలోనే ఉంటున్న తమ్ముడు బాలకృష్ణకు విషయం చెప్పాడు. అప్పటికే బాలకృష్ణకు స్మగ్లింగ్‌లో అనుభవం ఉండటంతో ఇద్దరూ కలిసి హాష్‌ ఆయిల్‌ను స్మగ్లింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఏవోబీకి చెందిన వ్యక్తి సహాయంతో ఏవోబీ నుంచి బెంగళూరుకు సరుకు రవాణా చేస్తున్నారు. ఏవోబీలో తక్కువ ధరకు హాష్‌ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్న స్మగ్లర్స్‌ బహిరంగ మార్కెట్లో పదిరెట్లు ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.


బస్సులో సరఫరా..

అన్నదమ్ములు ఇద్దరూ కాలేజీ కుర్రాళ్ల మాదిరిగా తయారై బ్యాగులో హాష్‌ ఆయిల్‌ను కేజీ చొప్పున ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాక్‌ చేసుకొని, బస్సులో ప్రయాణించేవారు. బెంగళూరు నుంచి రిసీవర్‌ వచ్చి పలానా చోట ఉన్నట్లు సమాచారం ఇస్తాడు. దాంతో అన్నదమ్ములిద్దరూ బస్సు దిగి రిసీవర్‌ ఉన్న ప్రాంతానికి వెళ్లి సరుకును అందజేసి వెళ్లిపోతారు. కొంతకాలంగా హాష్‌ ఆయిల్‌ను వయా హైదరాబాద్‌ వయా బెంగళూరుకు బస్సులో వెళ్లి సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న రాచకొండ ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు(Rachakonda LB Nagar SOT Police) ప్రత్యేక నిఘా పెట్టారు. ఒడిశా బోర్డర్‌ నుంచి 13.5 కేజీల హాష్‌ ఆయిల్‌తో బయల్దేరిన అన్నదమ్ములు పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ సమీపంలో బస్సు దిగారు.


అక్కడి నుంచి తాజా ఫుడ్స్‌ హోటల్‌కు చేరుకొని బెంగళూరు(Bangalore) నుంచి వచ్చే రిసీవర్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పటికే రెక్కీచేసిన ఎస్‌వోటీ పోలీసులు, హయత్‌నగర్‌ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు(Hayatnagar Law and Order Police) దాడిచేసి వారిని పట్టుకున్నారు. వారి నుంచి హాష్‌ ఆయిల్‌, రూ.2000 నగదు, రెండు ఫోన్లు, ప్లాస్టిక్‌ ప్యాకింగ్‌ కవర్‌ స్వాధీనం చేసుకున్నారు. సీజ్‌ చేసిన హాష్‌ ఆయిల్‌ విలువ బహిరంగ మార్కెట్లో రూ.14 కోట్లు ఉంటుందని సీపీ వెల్లడించారు. కాగా, కేజీ హాష్‌ ఆయిల్‌ను తయారు చేయడానికి 35 నుంచి 40 కేజీల గంజాయిని మరపట్టాల్సి ఉంటుంది. అలా పోలీసులు స్వాధీనం చేసుకున్న 13.5 కేజీల హాష్‌ ఆయిల్‌ను తయారు చేయడానికి సుమారు 560 కేజీల గంజాయిని వినియోగించినట్లు సీపీ తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 13 , 2024 | 08:41 AM

Advertising
Advertising
<