ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cricket: క్రికెట్‌లో విషాదం.. సిక్స్ కొట్టిన తర్వాత ప్రాణం విడిచిన క్రికెటర్

ABN, Publish Date - Jun 03 , 2024 | 06:02 PM

క్రికెట్‌‌లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. కాసేపు సిక్సులతో అదరగొట్టిన ఓ క్రికెటర్ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో.. మైదానంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ ఘటన..

Mumbai Man Dies Of Heart Attack During Cricket Match

క్రికెట్‌‌లో (Cricket) ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. కాసేపు సిక్సులతో అదరగొట్టిన ఓ క్రికెటర్ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో.. మైదానంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో (Mumbai) జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ కంపెనీ ముంబైలోని కశ్మీరా ఏరియాలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించింది. ఈ మ్యాచ్‌లో థానేకు చెందిన రామ్ గణేశ్ తేవార్ (Ram Ganesh Tewar) (42) అనే వ్యక్తి పాల్గొన్నాడు. బ్యాటింగ్ చేయడానికి వచ్చిన అతను.. కాసేపు సిక్సులతో అదరగొట్టాడు. క్రీజులో ఉన్నంతసేపు చురుకుగా ఆడాడు.


Read Also: గాల్లో ఢీ కొట్టుకున్న రెండు విమానాలు.. ఆ తర్వాత ఏమైందంటే?

అయితే.. ఒక సిక్స్ కొట్టిన తర్వాత గణేశ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తాను నిలుచున్న చోటే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన సహచర ఆటగాళ్లు వెంటనే అతని వద్దకు చేరుకొని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో.. ఆ మైదానంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Read Also: విరాట్ కోహ్లీపై సంచలనం.. అలాగైతే జట్టులో ఉండి దండగ!

కాగా.. గతంలోనూ ఇలా గుండెపోటుతో మృతిచెందిన సంఘటనలు వెలుగు చూశాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి.. క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే అతను ప్రాణాలు విడిచాడు. తన తోటి బ్యాటర్‌తో మాట్లాడి, తిరిగి బ్యాటింగ్ చేసేందుకు క్రీజు వద్దకు వెళ్తున్న క్రమంలో.. అతను కుప్పకూలాడు. అతనొక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని తేలింది.

Read Latest Crime News and Telugu News

Updated Date - Jun 03 , 2024 | 06:03 PM

Advertising
Advertising