ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD: పుష్పయాగం సందర్భంగా ఆ సేవలు రద్దు చేసిన టీటీడీ..

ABN, Publish Date - Nov 08 , 2024 | 11:56 AM

పుష్పయాగం సందర్భంగా రెండో అర్చన, రెండో గంట, నైవేద్యాలను స్వామివారికి సమర్పించనున్నారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామిని ఆలయ మాడవీధుల్లో ఊరిగేస్తారు.

తిరుమల: కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి ఈనెల 9న (శనివారం) పుష్పయాగాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం, శనివారం జరిగే పలు ఆర్జీత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. కల్యాణోత్సవం, ఉంజల్‌ సేవ, బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


ఈ నేపథ్యంలోనే శుక్రవారం సహస్ర దీపాలంకార సేవనూ రద్దు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. అలాగే నేడు శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ చేయనున్నట్లు వెల్లడించింది. పుష్పయాగం సందర్భంగా శ్రీవారికి శనివారం నాడు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయనున్నారు. అనంతరం పలు రకాల పువ్వులు, ఆకులతో ఘనంగా పుష్పార్చన చేస్తారు. అలాగే రేపు సాయంత్రం స్వామివారికి సహస్ర దీపాలంకార సేవ చేయనున్నారు.


పుష్పయాగం సందర్భంగా రెండో అర్చన, రెండో గంట, నైవేద్యాలను స్వామివారికి సమర్పించనున్నారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామిని ఆలయ మాడవీధుల్లో ఊరిగేస్తారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్ని తిరుమలేశుడిని దర్శించుకోనున్నారు. కార్తీక మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రం సందర్భంగా పుష్పయాగం చేస్తుంటారు. ఈ వేడుకకు తంపోపతండాలుగా భక్తులు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Nov 08 , 2024 | 11:56 AM