Medak: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ
ABN, Publish Date - Mar 08 , 2024 | 12:16 PM
Telangana: మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సిద్ధిపేటలోని శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. లింగోద్బవ సమయాన స్వామి వారికి ఆలయ అర్చకులు... మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అర్థరాత్రి సమయాన ఆలయ తోటబావి వద్ద పంచవర్ణాలతో 42 వరుసలతో ఆలయ ఒగ్గు పూజరులచే పెద్ద పట్నం నిర్వహణ జరుగనుంది.
మెదక్, మార్చి 8: మహాశివరాత్రి (Maha Shivratri) సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సిద్ధిపేటలోని శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో (Komuravelli Mallanna Temple) భక్తుల రద్దీ కొనసాగుతోంది. లింగోద్బవ సమయాన స్వామి వారికి ఆలయ అర్చకులు... మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అర్థరాత్రి సమయాన ఆలయ తోటబావి వద్ద పంచవర్ణాలతో 42 వరుసలతో ఆలయ ఒగ్గు పూజరులచే పెద్ద పట్నం నిర్వహణ జరుగనుంది. పెద్దపట్నం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
Andhrapradesh: ఇంద్రకీలాద్రిపై శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
అటు సంగారెడ్డి జిల్లా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర భక్తులు తెల్లవారుజాము నుంచి భారీగా తరలివస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Madhavilatha: బీజేపీ నేతలను కలిసిన మాధవీలత
Modi Presents: తొలిసారిగా 'నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అందించిన ప్రధాని మోదీ.. వీటి స్పెషల్ ఏంటంటే?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 08 , 2024 | 12:16 PM