Andhrapradesh: ఇంద్రకీలాద్రిపై శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Mar 08 , 2024 | 11:52 AM
Andhrapradesh: మహాశివరాత్రి సందర్భంగా పలు శైవక్షేత్రాలు శివ భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకదుర్గమ్మవారి సమీపంలోని భవాని జల శివాలయంలో భక్తులు పోటెత్తారు.
అమరావతి, మార్చి 8: మహాశివరాత్రి (Maha Shivratri) సందర్భంగా పలు శైవక్షేత్రాలు (Lord Shiva Temples) శివ భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకదుర్గమ్మవారి సమీపంలోని భవాని జల శివాలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే కృష్ణా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. యనమలకుదురు శివాలయంలో తెల్లవారుజాము నుంచి గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. మహాశివరాత్రి సందర్భంగా యనమలకుదురు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గ్రామంలోకి ద్విచక్ర వాహనాలు మినహా ఎటువంటి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. ఇంద్రకీలాద్రిపై భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం, వన్ టౌన్ పాత శివాలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: నువ్వంటే నాకిష్టం.. పెళ్లి చేసుకొని కలిసి జీవిద్దాం.. అని చెప్పి పత్తాలేకుండాపోయాడు..
IND vs ENG: సెంచరీలతో రోహిత్, గిల్ విధ్వంసం.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...