UPSC CSE Result: సివిల్స్‌లో సత్తా చాటిన పాలమూరు బిడ్డ
ABN, Publish Date - Apr 16 , 2024 | 02:45 PM
సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం నాడు విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్ సైట్‌లో చూడొచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది మే 28వ తేదీన జరిగింది. అందులో మెయిన్స్‌కు క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు.
ఢిల్లీ: సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ (UPSC) మంగళవారం నాడు విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్ సైట్‌లో చూడొచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది మే 28వ తేదీన జరిగింది. అందులో మెయిన్స్‌కు క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు. మెయిన్స్ పరీక్ష ఫలితాలను డిసెంబర్ 8వ తేదీన రిలీజ్ చేశారు. జనవరి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఇంటర్వ్యూ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలను నిర్వహించారు.
TS Lawcet: లాసెట్ దరఖాస్తు గడువు మరో 10 రోజులు పొడగింపు
మొత్తం 1016 మంది సివిల్స్ సర్వీసుకు ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవ ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచారు. అనిమెష్ ప్రదాన్ రెండో ర్యాంక్, డొనురు అనన్య రెడ్డి మూడో స్థానం దక్కించుకున్నారు. అనన్య రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గల మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు బిడ్డ సత్తా చాటారు. దాంతో అనన్య రెడ్డిని పలువురు అభినందించారు.
1016 మంది అభ్యర్థుల్లో ఐఏఎస్ కోసం 180 మంది, ఐఎఫ్ఎస్ కోసం 37 మంది, ఐపీఎస్ కోసం 200 మంది ఎంపిక చేశారు. అభ్యర్థుల్లో జనరల్ క్యాటగిరిలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 115 మంది, ఓబీసీ నుంచి 303 మంది, ఎస్సీలు 165, ఎస్టీలు 86 మంది ఉన్నారు.
SBI: ఎస్‌బీఐ ఫెలోషిప్ ప్రోగ్రామ్.. యువతకు మంచి ఆఫర్, రూ.70 వేలు
మరిన్ని విద్య వార్తల కోసం
Updated Date - Apr 16 , 2024 | 02:45 PM