ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lawcet: తెలంగాణ లాసెట్-2024 నోటిఫికేషన్ విడుదల

ABN, Publish Date - Mar 01 , 2024 | 02:51 PM

టీఎస్ లాసెట్-2024, తెలంగాణ పీజీ లాసెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి శుక్రవారం నాడు విడుదల చేసింది. మూడు, ఐదేళ్ల లా కోర్సు కోసం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో గల ఉస్మానియా యూనివర్సిటీ లాసెట్ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. లాసెట్‌కు రూ.900 ఫీజు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. పీజీఎల్ సెట్ 2024కు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ లాసెట్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 3వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ లాసెట్-2024 (TS LAWCET-2024), తెలంగాణ పీజీ లాసెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి శుక్రవారం నాడు విడుదల చేసింది. మూడు, ఐదేళ్ల లా కోర్సు కోసం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో గల ఉస్మానియా యూనివర్సిటీ (OU) లాసెట్ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆలస్య రుసుముతో మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లాసెట్‌కు (TS LAWCET-2024) రూ.900 ఫీజు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. పీజీఎల్ సెట్ 2024కు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ లాసెట్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 3వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మూడేళ్ల లా చదవాలంటే ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. ఐదేళ్ల లా కోర్పు కోసం ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి. పీజీ కోర్సు ఎల్ఎల్ఎంకు ఎల్ఎల్‌బీ లేదంటే బీఎల్ చేసి ఉండాలి.

జూన్ 3వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రాత పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మూడేళ్ల లా ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఐదేళ్ల లా ప్రవేశ పరీక్ష జరగనుంది. మొత్తం 120 మార్కుల్లో 35 శాతం (42 మార్కులు) మార్కులు సాధిస్తే క్వాలీ ఫై అవుతారు. లాసెట్ పేపర్ తెలుగుతోపాటు ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటుంది. పీజీఎల్‌సెట్ ఇంగ్లీషులో మాత్రమే ఉంటుంది. లాసెట్ 2024 దరఖాస్తు చేసుకునేందుకు ఈ లింక్ https://lawcet.tsche.ac.in క్లిక్ చేయండి.

మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 03:29 PM

Advertising
Advertising