AP Politics: తూర్పు గోదావరి జిల్లాలో హీటెక్కిన రాజకీయం..
ABN, Publish Date - Apr 29 , 2024 | 07:54 AM
ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పార్టీలన్నీ బీభత్సమైన జోరును కనబరుస్తున్నాయి. పోటాపోటీగా జనాల్లోకి వివిధ కార్యక్రమాలతో వెళుతున్నాయి. పార్టీ అధినేతలు సైతం నిత్యం జనాల్లోనే ఉంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల రాజకీయం హీటెక్కింది. మరి కాసేపట్లో జనసేన పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ రోడ్ షో, ర్యాలీ నిర్వహించనున్నారు.
కాకినాడ: ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పార్టీలన్నీ బీభత్సమైన జోరును కనబరుస్తున్నాయి. పోటాపోటీగా జనాల్లోకి వివిధ కార్యక్రమాలతో వెళుతున్నాయి. పార్టీ అధినేతలు సైతం నిత్యం జనాల్లోనే ఉంటున్నారు. ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. పార్టీ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (Jagan), జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తూర్పు గోదావరి జిల్లాను సందర్శించనున్నారు.
భూ యజమానితోపాటు కౌలురైతుకూ భరోసా
అసెంబ్లీ ఎన్నికల రాజకీయం హీటెక్కింది. మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నియోజకవర్గంలో భారీ రోడ్ షో, ర్యాలీ నిర్వహించనున్నారు. నామినేషన్ తర్వాత భారీ స్థాయిలో పిఠాపురం, గొల్లప్రోలు మండలాల మీదుగా భారీ ర్యాలీ చేపడుతున్నారు. పవన్ ర్యాలీ కోసం అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రోడ్డు షో నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఎన్నికల సభను సీఎం జగన్ నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మే 13న రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ: నారా చంద్రబాబు
ఓట్ల వేటలో రూ.కోట్లు.. బేరం చేస్తున్న వైసీపీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Updated Date - Apr 29 , 2024 | 07:54 AM