Lok Sabha Elections 2024: సీఈఓ వికాస్‌రాజ్‌ను కలిసిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు
ABN, Publish Date - Apr 27 , 2024 | 10:19 PM
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం జరుగుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అయితే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘానికి ఈ పార్టీలు శనివారం నాడు ఫిర్యాదు చేశాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం జరుగుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అయితే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘానికి ఈ పార్టీలు శనివారం నాడు ఫిర్యాదు చేశాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతల ఫిర్యాదు
సోషల్ మీడియాలో బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డితో పాటు కొంతమంది నేతలు సీఈఓ వికాస్ రాజ్‌ను శనివారం నాడు కలిశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు 4శాతం ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి ఇవ్వదన్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమిత్ షా అనని వ్యాఖ్యలు అన్నట్లుగా కాంగ్రెస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఈఓకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరామని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.
TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం
బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు
సీఈఓ వికాస్‌రాజ్‌ను బీఆర్ఎస్ నేతలు కలిసి బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నగేష్‌పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తిగా ఫిలప్ చేయలేదని ఆర్వోకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని సీఈఓ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ చేసి రిటర్నింగ్ అధికారి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్‌తో పాటు కొంతమంది నేతలు సీఈఓ వికాస్‌రాజ్‌ను శనివారం నాడు కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఒకపక్షంగా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. నామినేషన్ తిరస్కరించడానికి అన్ని ఆధారాలు చూపించిన రిటర్నింగ్ అధికారి ఎందుకు తిరస్కరించలేదని ప్రశ్నించారు. దేశంలోనే కాదు రాష్ట్రంలో ఎన్నికల అధికారులు సైతం బీజేపీకి సహకరిస్తున్నారని దాసోజ్ శ్రవణ్ విమర్శించారు.
Madhavilatha: మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఇన్‌స్టాలో పోస్టు చేసిన రేణుదేశాయ్
కేసీఆర్‌పై వీహెచ్‌పీ నేతల ఫిర్యాదు
సీఈవో వికాస్ రాజుని వీహెచ్‌పీ నేతలు కలిసి మాజీ సీఎం కేసీఆర్‌పై సీఈఓ వికాస్‌రాజ్‌కి ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని వీహెచ్‌పీ నేతలు ఫిర్యాదు చేశారు. దేవుడి పేరుతో అక్షింతలు పంచి ఆశచూపుతూ ఓట్లు వేసుకుంటున్నారనే వ్యాఖ్యలపై వీహెచ్‌పీ అభ్యంతరం తెలిపింది. కేసీఆర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్‌రాజ్‌ను కోరారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ నేతలు కోరారు.
Read Latest Election News or Telugu News
Updated Date - Apr 27 , 2024 | 10:26 PM