Lok Sabha Election 2024: అందుకే బీజేపీ రాముడిని వాడుకుంటుంది: రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - May 09 , 2024 | 06:53 PM
బీజేపీ (BJP) పదేళ్లు దేశంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. నర్సాపూర్‌లో గురువారం కాంగ్రెస్ జనజాతర సభ జరిగింది. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దుబ్బాక ప్రజలకు బీజేపీ అభ్యర్థి (రఘునందన్‌రావు) ఏం చేయలేదని మండిపడ్డారు.
మెదక్: బీజేపీ (BJP) పదేళ్లు దేశంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. నర్సాపూర్‌లో గురువారం కాంగ్రెస్ జనజాతర సభ జరిగింది. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దుబ్బాక ప్రజలకు బీజేపీ అభ్యర్థి (రఘునందన్‌రావు) ఏం చేయలేదని మండిపడ్డారు. ఆయన మీద నమ్మకంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు.
T.High Court: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైకోర్టుకు టీపీసీసీ
అలాంటి వ్యక్తి ఇప్పుడు మెదక్ నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు. దుబ్బాకలో ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే రఘునందన్‌రావును మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారని అన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయనకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజల భూములు లాక్కున్న వ్యక్తి(వెంకట్రామిరెడ్డి) బీఆర్‌ఎస్ తరపున ఎంపీగా పోటీలో ఉన్నారని చెప్పుకొచ్చారు.
భూనిర్వాసితులను మోసం చేసిన వెంకట్రామిరెడ్డికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీకి రాముడు గుర్తుకొస్తాడని విమర్శించారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలని ఉద్ఘాటించారు. పోలింగ్ బూత్‌లో ఓట్ల కోసం దేవుడి పేరును వాడుకోవద్దని హితవు పలికారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ అడిగితే.. మోదీ గాడిదగుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మోదీ గాడిదగుడ్డు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు గుప్పించారు.
Loksabha Polls: పెద్దపల్లిలో కీ ఓటర్స్ వీరే..?
Read latest Telangana News And Telugu News
Updated Date - May 09 , 2024 | 06:59 PM