Loksabha Polls: కంచుకోటకు దూరంగా గాంధీలు.. ఎందుకంటే..?
ABN, Publish Date - May 03 , 2024 | 02:15 PM
అమేథి లోక్ సభ నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. గత 31 ఏళ్ల నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలోకి దిగారు. అమేథితో గాంధీ కుటుంబానికి 1980 నుంచి అనుబంధం ఉంది.
గాంధీల కంచుకోట అమేథి లోక్ సభ నియోజకవర్గం. 2019కి ముందు గాంధీల వారసులు ఇక్కడ నుంచి బరిలోకి దిగేవారు. ఈ ఎన్నికల్లో బయటి వ్యక్తిని బరిలోకి దింపారు. పోటీకి దిగిన కిశోర్ లాల్ శర్మ గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. అతడిని అభ్యర్థిగా ప్రకటించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. అమేథి, రాయ్ బరేలి కోసం కిశోర్ తన జీవితాన్ని త్యాగం చేశారని వివరించారు. అమేథి నుంచి ఆయన అభ్యర్థిగా బరిలోకి దిగడంపై సంబర పడ్డారు.
కంచుకోటే.. కానీ
అమేథి లోక్ సభ నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. గత 31 ఏళ్ల నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలోకి దిగారు. రెండు సార్లు ఇతర పార్టీ అభ్యర్థులు గెలిచారు. 1980 నుంచి అమేథితో గాంధీ కుటుంబానికి విడదీయరాని బంధం ఏర్పడింది. ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ పోటీ చేసి, గెలుపొందారు. సంజయ్ మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ పోటీ చేశారు. అప్పటి నుంచి రాజీవ్ గాంధీ అమేథి నుంచి బరిలోకి దిగారు. 1984, 1989, 1991లో వరసగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 1991లో రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత కాంగ్రెస్ నేత సతీష్ శర్మ1991 ఉప ఎన్నిక, 1996 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందారు. 1999 నుంచి రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ బరిలోకి దిగారు. 2004లో కుమారుడు రాహుల్ గాంధీ కోసం సీటును త్యాగం చేశారు. 2009, 2014లో రాహుల్ గాంధీ గెలుపొంది, హ్యాట్రిక్ కొట్టారు. 2019లో మాత్రం స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. మరోసారి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ అంగీకరించలేదు. దాంతో కిశోర్ శర్మకు టికెట్ దక్కింది.
ఎవరీ శర్మ
రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సతీష్ శర్మ పోటీ చేసి గెలుపొందారు. ఇన్నాళ్లకు మరో శర్మ.. కిశోరి లాల్ బరిలోకి దిగారు. పంజాబ్‌లో గల లుధియానా కిశోర్ శర్ స్వస్థలం. గాంధీల కుటుంబానికి నమ్మిన బంటు. 1987 నుంచి అమేథి నియోజకవర్గం కోసం పనిచేస్తున్నారు. 1990లో సోనియా గాంధీ విజయం సాధించడంలో కీ రోల్ పోషించారు. ఇన్నాళ్లకు అమేథి నుంచి పోటీ చేసే అరుదైన అవకాశం వచ్చింది.
For more Lok Sabha Polls news and Telugu News
Updated Date - May 03 , 2024 | 02:15 PM