Loksabha polls: ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్ ఎన్నికల అధికారి ఏమన్నారంటే?
ABN, Publish Date - May 10 , 2024 | 04:27 PM
Telangana: ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు చాలా మంచి స్పందన వచ్చిందని... 14,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించారని వెల్లడించారు.
హైదరాబాద్, మే 10: లోక్‌సభ ఎన్నికలకు (Loksabha Elections 2024) అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ (Hyderabad Election Officer Ronald Rose) తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు చాలా మంచి స్పందన వచ్చిందని... 14,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించారని వెల్లడించారు. గతంతో పోలిస్తే 6000 మంది అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఈరోజు సాయంత్రంతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ముగుస్తుందని చెప్పారు.
AP Elections 2024: ఓటర్లకు వెరైటీ ఆహ్వాన పత్రిక.. అదిరిపోయిందిగా.. ఓ లుక్కేయండి!
హోమ్ ఓటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా జరిగిందన్నారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ సిబ్బందిని డీఆర్సీ సెంటర్లకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక బస్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలింగ్ స్టేషన్లో వద్ద ఉన్న క్యూ తెలుసుకోవడానికి పోల్ క్యూ ఆప్ చూసుకోవచ్చన్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా పోలింగ్ స్టేషన్ దారి కనుక్కోవచ్చని చెప్పారు. వృద్ధులకు, వికలాంగులకు పికప్ అండ్ డ్రాప్ అవకాశం కలిపిస్తున్నామని.. ఇప్పటి వరకు 330 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇంకా కావలసిన వాళ్లు సాక్ష్యం యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. రూ.42 కోట్ల విలువైన వస్తువులు, లిక్కర్, డబ్బులు సీజర్ చేశామన్నారు. 3896 పోలింగ్ బూతుల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. పోలింగ్ బూతు బయట సైడ్ కూడా సీసీ కెమెరాలు ఉంటాయన్నారు. మైక్రో అబ్జర్వర్ల కేటాయింపు రేపు జరుగుతుందని ఎన్నికల అధికారి తెలిపారు.
Kejriwal Bail: కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..
‘‘సి విజిల్’’ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కారం చేస్తున్నామన్నారు. 72 గంటల్లో మరింత పటిష్టంగా విజిలెన్స్ టీంలు పనిచేస్తాయన్నారు. పౌరులు 50 వేల కంటే ఎక్కువగా నగదును క్యారీ చేయడానికి వీలులేదని స్పష్టం చేశారు. అవసరం ఉంటే సరైన పత్రాలు చూపించాల్సి ఉంటుందన్నారు. పొలిటికల్ పార్టీలో ఉన్నవారు రేపటితో పేపర్లో వివరాలు ప్రచురించాలన్నారు. ఎండాకాలం నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉంటుందన్నారు. ప్రచారం రేపు సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని... తర్వాత సైలెన్స్ పీరియడ్ ప్రారంభమవుతుందని తెలిపారు. నియోజకవర్గానికి చెందినవారు కాకుండా ఎవరూ అక్కడ ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రకటనలు ఎన్నికల అధికారులతో అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే ప్రచురించాలని ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
Stock Market: వారాంతంలో లాభాల జోష్.. సెన్సెక్స్ 260 పాయింట్ల ప్లస్!
Telangana: మల్లన్నా మజాకా.. బర్రెలతో మల్లారెడ్డి ముచ్చట్లు.. వీడియో చూస్తే నవ్వాగదు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 10 , 2024 | 04:55 PM