Lok Sabha Elections 2024: రిజర్వేషన్లు తీసేస్తే బీజేపీ నేతలను తరిమి కొడతారు: మంత్రి ప్రభాకర్
ABN, Publish Date - Apr 29 , 2024 | 04:30 PM
కేంద్రంలో మరోసారి బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. రిజర్వేషన్లు ముట్టుకుంటే బీజేపీ నేతలు మాడిమసై పోతారని వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్: కేంద్రంలో మరోసారి బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. రిజర్వేషన్లు ముట్టుకుంటే బీజేపీ నేతలు మాడిమసై పోతారని వార్నింగ్ ఇచ్చారు. రిజర్వేషన్లు తీసేస్తే బీజేపీ నేతలను తరిమి కొడతారని హెచ్చరించారు. బీజేపీ నేతలు వొళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మందలించారు.రిజర్వేషన్లు తీసే ఆలోచన ఉన్న బీజేపీ నేతలని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ ఏం చేసిందో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ 400 ఎంపీ సీట్లు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. దళితులకు, బలహీన వర్గాలకు మోదీ ఏం న్యాయం చేయలేదని విరుచుకుపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో మంత్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమన్నారు. దెబ్బ తగిలిందనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
Bandi Sanjay: నువ్వొక డ్రామా ఆర్టిస్ట్.. నీ అయ్య లేకుంటే నీ బతుకేంది?
హైదరాబాద్‌ని యూటీ చేయమని కొందరు అడిగితే సోనియా గాంధీ ఒప్పుకోలేదన్నారు. ఆత్మగౌరవం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు బీజేపీ నుంచి బయటకు రావాలని కోరారు. రిజర్వేషన్లు అంటే ఇష్టంలేని బీజేపీని లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఒక మంత్రిగా కాదు.. బీసీ బిడ్డగా తాను రిజర్వేషన్లు గురించి బీజేపీని ప్రశ్నిస్తున్నానని అన్నారు. రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ప్రతి ఊర్లలో జేఏసీలు ఏర్పాటు చేసుకొని పోరాడుదామని అన్నారు. తెలంగాణ పోరాటం లాగా రిజర్వేషన్లను కాపాడుకునే పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను గ్రామాల్లో నిలదీయాలన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు తెలంగాణ గుడులకు చేసిందేంటి? అని ప్రశ్నించారు. పదేళ్లలో బీజేపీ ఎన్ని గుళ్లను నిర్మించిందని నిలదీశారు. మంగళ సూత్రాలు తెంచే సంస్కృతి తమ పార్టీది కాదన్నారు. ఆస్తులు ఇచ్చిన చరిత్ర తప్పా.. గుంజుకున్న చరిత్ర కాంగ్రెస్‌కి (Congress) లేదన్నారు. మోదీ నైతికంగా దిగజారారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
Read Latest Election News or Telugu News
Ponnala Laxmaiah: 1.85 శాతం ఓట్లతో ఓడిపోయిన బీఆర్‌ఎస్ చచ్చిన పాము ఎలా అవుతుంది?
Updated Date - Apr 29 , 2024 | 04:42 PM