Seethakka: కేసీఆర్ బయటకు వచ్చేది అప్పుడే.. హరీష్ రావు మరో షిండే
ABN, Publish Date - Apr 27 , 2024 | 07:05 PM
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం దేవుళ్లను రాజకీయ అంశాలుగా మార్చుకుంటారని వివరించారు. జనం నుంచి డబ్బులు వసూల్ చేసి మరి అయోధ్యలో ఆలయం నిర్మించారని గుర్తుచేశారు.
కొమురం భీం జిల్లా: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ మంత్రి సీతక్క (Seethakka) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం దేవుళ్లను రాజకీయ అంశాలుగా మార్చుకుంటారని వివరించారు. జనం నుంచి డబ్బులు వసూల్ చేసి మరి అయోధ్యలో ఆలయం నిర్మించారని గుర్తుచేశారు. దేవుడి సెంటిమెంట్ వల్ల నాలుగు ఓట్లు పడతాయని చూస్తారని విరుచుకుపడ్డారు. బెజ్జూర్‌లో జరిగిన కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు.
TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీతక్క మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ బయటకు వస్తాడని విమర్శించారు. మిగతా టైమ్‌లో బయటకు రాడని, ప్రజల సమస్యల గురించి పట్టించుకోడని మండిపడ్డారు. ఇప్పుడు కేసీఆర్ బయటకొచ్చి చెప్పే మాటలను ప్రజలు విశ్వసించడం లేదని విరుచుకుపడ్డారు. సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు మరో ఏక్‌నాథ్ షిండే అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం
Read Latest Telangana News or Telugu News
Updated Date - Apr 27 , 2024 | 07:05 PM