ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: రేవంత్ నువ్వు హిందువైతే.. అక్కడకు రా.. తెల్చుకుందాం.. బీజేపీ నేత సవాల్

ABN, Publish Date - May 06 , 2024 | 09:52 PM

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హిందువైతే భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రావాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) సవాల్ విసిరారు. 27 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించింది రాజీవ్ గాంధీ అవునా..? కాదా...? ప్రమాణం చేయాలి అని సవాల్ విసిరారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించింది రాజీవ్ గాంధీ అవునా కాదా..? ప్రమాణం చేయాలన్నారు.

MP Laxman

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హిందువైతే భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రావాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) సవాల్ విసిరారు. గతంలో 27 శాతం రిజర్వేషన్లను దివంగత నేత రాజీవ్ గాంధీ వ్యతిరేకించలేదా అని ప్రశ్నించారు. ఆయన కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించారని అన్నారు.


TG Politics: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీకి ఆ పార్టీ మద్దతు

రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్ల రద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ పదే పదే బీజేపీపై తప్పుడు ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకొందని విరుచుకుపడ్డారు.రాజీవ్, రాహుల్ వసూళ్లతో ప్రజల రక్తాన్ని జలగల్లా జుర్రుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి చివరికి మిగిలేది గాడిద గుడ్డు మాత్రమేనని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి హిందూ మనోభావాలను చులకన చేసి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. హిందూ దేవుళ్లంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత చులకన..? అని ప్రశ్నించారు.


రేవంత్ రెడ్డికి హిందువునని చెప్పుకొనే అర్హత లేదన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయమంటే గాడిద గుడ్డు చూయిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు వ్యవహారం చూస్తుంటే, కాంగ్రెస్ గుర్తు మొండి చెయ్యా.. లేక గాడిద గుడ్డా అనేది అనుమానం కలుగుతోంది..? అని సెటైర్లు గుప్పించారు. కర్ణాటక, తెలంగాణలో హామీలు అమలు చేయడంతో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు దేశ వ్యాప్తంగా అమలు చేశారంటే మిగిలేది గాడిద గుడ్డేనని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.

Telangana: రైతులకు గుడ్ న్యూస్.. వారి అకౌంట్లలో నిధులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2024 | 11:04 PM

Advertising
Advertising