PM Modi: మీమ్ చూసి ముచ్చటేసింది..!!
ABN, Publish Date - May 07 , 2024 | 10:35 AM
సోషల్ మీడియాలో ప్రముఖుల మీమ్స్ సందడి చేస్తుంటాయి. కొందరు క్రియేటర్స్ మీమ్స్ చేసి పోస్ట్ చేస్తుంటారు. మీమ్స్ చూసి కొందరు లైట్ తీసుకుంటారు. మరికొందరు సీరియస్‌గా తీసుకొని, కేసులు పెడతారు.
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రముఖుల మీమ్స్ సందడి చేస్తుంటాయి. కొందరు క్రియేటర్స్ మీమ్స్ చేసి పోస్ట్ చేస్తుంటారు. మీమ్స్ చూసి కొందరు లైట్ తీసుకుంటారు. మరికొందరు సీరియస్‌గా తీసుకొని, కేసులు పెడతారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మీమ్ పోస్ట్ చేశారు. ఆమె వెంటనే పోలీసుల చేత దర్యాప్తునకు ఆదేశించారు. ప్రధాని మోదీ మీమ్‌ను మరొకరు పోస్ట్ చేశారు. ఆ మీమ్ చూసి సంతోషించానని ప్రధాని మోదీ (PM Modi) అభిప్రాయ పడ్డారు.
కూల్ కూల్
ప్రధాని మోదీ మమతా బెనర్జీ మాదిరిగా కాకుండా కూల్‌గా రియాక్ట్ అయ్యారు. ‘ఆ మీమ్‌లో తన రూపంతో ఉన్న వ్యక్తి డ్యాన్స్ చేయడం ఆనందం కలిగించింది. ఎన్నికల సమయంలో ఇలాంటి క్రియేటివిటి చూసి సంతోషం కలిగింది. అని’ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. గతంలో కూడా ప్రధాని మోదీపై జోక్స్, కార్టూన్లు. మీమ్స్ వచ్చాయి.
ఆర్కే లక్ష్మణ్
గతంలో ఆర్కే లక్ష్మణ్ కార్టున్లూ వేసేవారు. సామాన్య జనం నుంచి రాజకీయ నేతల లక్ష్యంగా అవి ఉండేవి. ఎంత విమర్శించిన రాజకీయ నేతలు పెద్దగా పట్టించుకునే వారు కాదు. పరిస్థితి మారింది. పొలిటికల్ లీడర్లపై కార్టూన్లు తగ్గాయి. కాలనుగుణంగా సోషల్ మీడియా వచ్చేసింది. అందులో కార్టున్లూ, మీమ్స్ వచ్చేస్తున్నాయి. మిగతా నేతలు సీరియస్‌గా తీసుకోగా.. ప్రధాని మోదీ మాత్రం కూల్‌గా ఉన్నారు. మీమ్ చూసిన తాను సంబరపడ్డానని వివరించారు.
కేసులు
శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై వచ్చిన మీమ్స్ గురించి ఆ పార్టీ నేతలు కేసులు కూడా నమోదు చేశారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 07 , 2024 | 10:36 AM