Kerjiwal: మోదీ తలచుకుంటే ఎవరినైనా జైలుకు పంపించగలరు..?
ABN, Publish Date - May 19 , 2024 | 01:43 PM
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. అరెస్ట్‌ను నిరసిస్తూ ఈ రోజు ఆప్ బీజేపీ కేంద్ర కార్యాలయానికి ముట్టడికి పిలుపునిచ్చింది. సీఎం కేజ్రీవాల్, ఆప్ ముఖ్యనేతలు బీజేపీ కార్యాలయానికి తరలి వచ్చారు. ఆప్ నేతల బీజేపీ ఆఫీసు ముట్టడి నేపథ్యంలో పోలీసు బలగాలను భారీగా మొహరించారు.
ఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. అరెస్ట్‌ను నిరసిస్తూ ఈ రోజు ఆప్ బీజేపీ కేంద్ర కార్యాలయానికి ముట్టడికి పిలుపునిచ్చింది. సీఎం కేజ్రీవాల్, ఆప్ ముఖ్యనేతలు బీజేపీ కార్యాలయానికి తరలి వచ్చారు. ఆప్ నేతల బీజేపీ ఆఫీసు ముట్టడి నేపథ్యంలో పోలీసు బలగాలను భారీగా మొహరించారు.
ఆపరేషన్ జాదూ..!!
ఆప్‌ను నిర్వీర్యం చేయాలని బీజేపీ ప్రణాళిక రచించిందని అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ మూడు ప్రణాళికలతో ఉందని వివరించారు. పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారని పేర్కొన్నారు. కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది చెప్పడంతో ఈ విషయం అర్థం అయ్యిందన్నారు. ఎన్నికల తర్వాత అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారని వివరించారు. పార్టీ కార్యాలయాన్ని కూడా సీజ్ చేస్తారని పేర్కొన్నారు. దాంతో తమ పార్టీ వీధుల్లోకి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మూడు ప్రణాళికలను బీజేపీ రచించిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీన ప్రజలు ఇచ్చే తీర్పును చూసి ప్రధాని మోదీ ఖంగుతినడం ఖాయం అన్నారు.
ఏం జరిగిందంటే..?
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వచ్చారు. లిక్కర్ స్కామ్‌లో అరెస్టై బెయిల్ మీద కేజ్రీవాల్ బయటకు రావడంతో ఆయనను కలిసేందుకు వచ్చారు. ఆ సమయంలో కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ స్వాతిపై దాడి చేశారని వివరించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిన్న బిభవ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. బిభవ్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఈ రోజు బీజేపీ కేంద్ర కార్యాలయం ముట్టడికి ఆప్ పిలుపునిచ్చింది.
Read Latest National News and Telugu News
Updated Date - May 19 , 2024 | 01:44 PM