Lok Sabha Elections 2024: వారిద్దరికి దేశ సంపదను దోచి పెడుతున్న మోదీ: పొన్నం ప్రభాకర్
ABN, Publish Date - Apr 30 , 2024 | 10:00 PM
దేశసంపదను అదానీ, అంబానీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దోచిపెడుతున్నారని.. వారికి ఎందుకు ఓటు వేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రశ్నించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట, పందిళ్లలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ , కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు , ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా: దేశసంపదను అదానీ, అంబానీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దోచిపెడుతున్నారని.. వారికి ఎందుకు ఓటు వేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)ప్రశ్నించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట, పందిళ్లలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ , కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు , ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ... బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చెప్పే మాటలు నమ్మొద్దని.. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి ఓటు వేస్తే లాభం లేదని చెప్పారు.
Loksabha polls 2024: కరెంట్ పోయిందంటూ అబద్దాలు చెబుతున్నారు.. కేసీఆర్‌పై తుమ్మల ఆగ్రహం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కి గ్యాస్, రూ. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇళ్లు లేని వారికి మొదటి ప్రాధాన్యతగా రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని.. ఇప్పుడు రేషన్ కార్డులు, రూ.4000 పెన్షన్ ఇచ్చే బాధ్యత తమదని తెలిపారు. 10 ఏళ్లలో కేసీఆర్ నిరుద్యోగులకు రూ.3016 నిరుద్యోగ భృతి ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని చెప్పారు.
Loksabha polls 2024: కేసీఆర్.. స్థాయిని మరిచి అబద్దాలు మాట్లాడుతున్నారన్న భట్టి
వచ్చే ఆగస్టు 15వ తేదీ వరకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం, వానాకాలం పంటకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేయలేదన్నారు. అభివృద్ధిపై ఈ రెండు పార్టీల నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు.2004 -14 మధ్య ఇచ్చిన హామీలు అమలు చేశామని.. ఇప్పుడు కూడా 6 గ్యారెంటీలను అన్నీ అమలు చేస్తామని మాటిచ్చారు.బీజేపీ ఎంపీ బండి సంజయ్ హుస్నాబాద్ నియోజకవర్గానికి అక్కన్నపేట మండలానికి ఏం చేశారో చర్చకు రావాలని సవాల్ విసిరారు.లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి 400 ఎంపీ సీట్లు ఇస్తే దేశానికి ఏం చేస్తారో మొదట చెప్పాలని అడిగారు.
బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తీసేసి రోడ్డు మీద పడేలా చేస్తారని అన్నారు. బండి సంజయ్ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు ఉండాలన్న అందరికీ న్యాయం జరగాలన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే గౌరవెల్లి , గండిపెల్లి కాల్వల ద్వారా గ్రామాలకు నీళ్లు తెచ్చే బాధ్యత తనదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
Madhukar Reddy: కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 30 , 2024 | 10:33 PM