Lok Sabha Election 2024: తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారు: ప్రధాని మోదీ
ABN, Publish Date - May 10 , 2024 | 04:33 PM
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఆర్ ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఆరోపించారు. తాను ఆర్ ఆర్ ట్యాక్స్ అన్నాను.. కానీ ఎవ్వరి పేరు చెప్పలేదని.. కానీ సీఎం రేవంత్ మాత్రం మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు చెబతున్నారనిఅన్నారు. మొదట రాహూల్ ప్రేమ దుకాణం పెట్టి.. ఇప్పుడు విద్వేషం చూపుతున్నారని విమర్శించారు.
నారాయణపేట జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఆర్ ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఆరోపించారు. తాను ఆర్ ఆర్ ట్యాక్స్ అన్నాను.. కానీ ఎవ్వరి పేరు చెప్పలేదని.. కానీ సీఎం రేవంత్ మాత్రం మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు చెబతున్నారనిఅన్నారు. మొదట రాహూల్ ప్రేమ దుకాణం పెట్టి.. ఇప్పుడు విద్వేషం చూపుతున్నారని విమర్శించారు. నారాయణపేటలో శుక్రవారం బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది, ఈ సభలో ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Chintala Ramchandra Reddy: ఓటమి భయంతోనే బీజేపీపై దుష్ప్రచారం..
కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకుంటున్నారు...
‘‘ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తు కోసం అని తెలంగాణ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ నేతలు చేసిన వాగ్దానాలు జనాలను మోసం చేసేవే. మోదీ గ్యారెంటీ అంటే.. దేశ భద్రతకు.. పేదలకు మూడు కోట్ల ఇళ్లను ఇచ్చే గ్యారంటీ. పదేళ్లలో దేశం చాలా అభివృద్ది చెందింది. తెలంగాణ కోసం లక్షల కోట్ల రూపాయల పంపించా.. కానీ అవినీతి బీఆర్ఎస్ జేబులు నింపుకుంది.. ఇప్పుడు కాంగ్రస్ నేతలు నింపుకుంటున్నారు. తుక్డే గ్యాంగ్... రాహూల్ అనుచరులు ఒకరు.. సౌత్ ఇండియా వాళ్లను ఆఫ్రికా వాళ్లు అని వ్యంగ్యంగా మాట్లాడారు. కాంగ్రెస్ మొదటి నుంచి హిందూ విరోధి.. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు అంటగట్టాలని చూస్తుంది’’’ అని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.
ఫేక్ వీడియో పరిశ్రమలు పెడుతున్న కాంగ్రెస్
‘‘తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నో వాగ్ధానాలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఎక్కువ అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాళేశ్వరంపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఎందుకు రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిశ్రమలు పెడతామని చెప్పి.. ఫేక్ వీడియో పరిశ్రమలు పెడుతుంది. మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్.. కాంగ్రెస్ నేతలు వాళ్ల స్వార్థం కోసం మాత్రమే పని చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే అత్యధికంగా బీజేపీ ప్రాతినిధ్యం ఉండాలి. కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉన్నా.. సాగు నీరు లేక.. జనం వలస వెళ్తున్నారు. కాంగ్రెస్ ఇక్కడి జనాలకు ఇచ్చింది.. నమ్మక ద్రోహం మాత్రమే. అయోధ్యలో రామ్ మందిర నిర్మాణం.. రామనవమి చేయటం దేశ విరోధం అన్నారు. హిందువులను మన దేశంలోనే రెండో శ్రేణి పౌరులుగా మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని జాతి.. ధర్మంల మధ్య చీలిక చేసేందుకు యత్నిస్తోంది. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని చూస్తుంది’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gold and Silver Rates: అక్షయ తృతీయ సందర్భంగా గుడ్ న్యూస్..తగ్గిన గోల్డ్ ధర
Read Latest Telangana News and Telugu News
Updated Date - May 10 , 2024 | 05:22 PM