ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Priyanka Gandhi: అర్థం లేని వ్యాఖ్యలపై స్పందించను.. కంగన కామెంట్లపై ప్రియాంక గాంధీ ఆగ్రహం

ABN, Publish Date - Apr 17 , 2024 | 03:48 PM

రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీపై బీజేపీ నేత, బాలీవుడ్ నటి కంగన రనౌత్ వివాదాస్పద వ్యాఖ్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ బుధవారం నాడు మాట్లాడారు. అర్థం, పర్థం లేని వ్యాఖ్యలపై మాట్లాడాలని అనుకోవడం లేదు. తమ గురించి కంగన మాట్లాడినందుకు ధన్యవాదాలు అని ప్రకటించారు.

Priyanka Gandhi Brushes Off Kangana Ranaut Criticism

రాహుల్ గాంధీ (Rahul Gandhi), కూతురు ప్రియాంక గాంధీపై (Priyanka Gandhi) బీజేపీ నేత, బాలీవుడ్ నటి కంగన రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లపై ప్రియాంక గాంధీ బుధవారం నాడు మాట్లాడారు. తమ గురించి కంగన మాట్లాడినందుకు ధన్యవాదాలు అని ప్రకటించారు. కంగన రనౌత్ వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని మీడియా ప్రతినిధులు అడగగా ప్రియాంక గాంధీ అసహనం వ్యక్తం చేశారు. అర్థం పర్థం లేని కామెంట్ల గురించి నేను మాట్లాడాలా అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆరోపణలను కొన్నేళ్ల నుంచి ఎదుర్కొంటున్నామని ప్రియాంక వివరించారు. తన తండ్రి రాజీవ్ గాంధీ బతికి ఉన్న సమయంలో తన తల్లి సోనియా గాంధీ ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.

Delhi: ఆప్ కా రాం రాజ్య వెబ్‌సైట్‌ని ప్రారంభించిన ఆప్.. అసలేంటిది


కంగన ఏమన్నారంటే..?

ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ హిమాచల్ ప్రదేశ్ మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో గాంధీ కుటుంబం గురించి కంగన రనౌత్ స్పందించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాజకీయాలకు సరిపోరని స్పష్టం చేశారు. తన స్వార్థ్యం కోసం ఓ గొప్ప తల్లిని రాహుల్ గాంధీ ఇబ్బందికి గురిచేశాడు. సోనియా గాంధీకి ఇష్టం లేకున్నా సరే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాజకీయాల్లో కంటిన్యూ అయ్యేందుకు సోనియా గాంధీని వేధిస్తున్నారు అని’ కంగన రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు.

Lok Sabha polls 2024: ఎన్డీయేకు 150 సీట్లు దాటవు.. సంయుక్త సమావేశంలో రాహుల్, అఖిలేష్

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 17 , 2024 | 04:15 PM

Advertising
Advertising