ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. రఘునందన్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - May 01 , 2024 | 08:50 PM

మొన్న సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడిన మాటలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. గజ్వేల్ పట్టణంలో బుధవారం ఓ ఫంక్షన్ హల్లో బీజేపీ ఓబీసీ సామజిక సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి రఘునందన్ రావు, బీజేపీ కీలక నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Raghunandan Rao

సిద్దిపేట జిల్లా: మొన్న సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడిన మాటలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. గజ్వేల్ పట్టణంలో బుధవారం ఓ ఫంక్షన్ హల్లో బీజేపీ ఓబీసీ సామజిక సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి రఘునందన్ రావు, బీజేపీ కీలక నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

TS High Court: కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు

ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ...గతంలో వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్నసమయంలో హరీష్‌రావు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని.. ఈ విషయాన్ని హరీశ్‌రావు కూడా చెప్పారని అన్నారు. ఈ విషయాన్ని కావాలంటే సర్పంచ్‌లతో సాక్ష్యం చెప్పిస్తానని అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు హరీష్ రావుకు పాలేరుగా ఉన్నారని.. కాని దుబ్బకకు ఎన్నడూ రూపాయి తేలేదని విమర్శించారు.


మెదక్, దుబ్బాక అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు నడుస్తే కాలు విరుగుతుందని.. బాత్రూంకి పోతే నడుం వీరుగుతుందని.. ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఓబీసీలకు రావాల్సిన సీట్లను తీసుకుపోయి ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. ఆ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రజలను వెంకట్రామిరెడ్డి అదుకోలేదని.. కానీ కోకాపేటలో మాత్రం రూ.100 కోట్లతో భూములు కొన్నారని రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Konda Surekha: కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం

Read Latest Election News or Telugu News

Updated Date - May 01 , 2024 | 08:52 PM

Advertising
Advertising