Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే..: రఘురాంరెడ్డి
ABN, Publish Date - Apr 28 , 2024 | 04:49 PM
అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే తమ ప్రభుత్వం 5 గ్యారెంటీలను పూర్తి చేసిందని కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి (Rama Sahayam Raghuram Reddy) తెలిపారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ (Congress) కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్లొన్నారు. కాంగ్రెస్ నాయులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా: అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే తమ ప్రభుత్వం 5 గ్యారెంటీలను పూర్తి చేసిందని కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి (Rama Sahayam Raghuram Reddy) తెలిపారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ (Congress) కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్లొన్నారు. కాంగ్రెస్ నాయులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఘురాంరెడ్డి మాట్లాడుతూ... కేంద్ర మేనిఫెస్టోలో 25 గ్యారెంటీలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే ప్రకటించారని చెప్పారు. యువతకు అనేక గ్యారెంటీలు ప్రకటించారని తెలిపారు. 5 ఏళ్లు మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చుని.. ఇప్పుడు కర్ర పట్టుకుని లోక్‌సభ ఎన్నికల కోసం బాబు బాబు అంటూ... ఊళ్లు తిరుగుతూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
Congress: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం సవాల్..
కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిట్లో ఫెయిల్ అయిందన్నారు. బీజేపీ పార్టీ నాయకులు అయోధ్య పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన పేరే రామా.. సహాయం.. తాను సొంతంగా రామాలయం నిర్మించానని.. భగవంతుడు అందరికీ దేవుడేనని స్పష్టం చేశారు. మరో నాలుగున్నరేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో అధికారంలో ఉంటుందని చెప్పుకొచ్చారు.
BJP: కేసీఆర్ అనే నాణానికి వారిద్దరూ బొమ్మ బొరుసులు: బండి సంజయ్
ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయటం వృథా అని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్‌లోకి వస్తారని జోస్యం చెప్పారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఖమ్మం జిల్లాను వదలి వెళ్లనని.. జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని.. తనకు ఓటు వేస్తే రాహుల్ గాంధీ గెలిచినట్లేనని రఘురాంరెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
KTR: ఇచ్చిన మాట నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వం: కేటీఆర్
Konda Visveshwar Reddy: మోదీ వేవ్ తెలంగాణలోనూ కనిపిస్తోంది: కొండా
Read Latest Election News or Telugu News
Updated Date - Apr 28 , 2024 | 04:59 PM