మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Priyanka Gandhi: నిశ్శబ్దం, త్యాగం మా విశ్వాసానికి ప్రతీక.. బీజేపీపై ప్రియాంక గాంధీ నిప్పులు

ABN, Publish Date - Apr 13 , 2024 | 03:26 PM

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ వాద్రా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్‌ రామ్ నగర్‌లో ప్రియాంక శనివారం నాడు ప్రచారం చేశారు. త్యాగం గురించి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. బీజేపీలో ఏ ఒక్కరి పేరు ప్రస్తావించకుండా ప్రియాంక విమర్శలు చేశారు. దేశం కోసం ఎంత చేసినా సరే తమ కుటుంబాన్ని అవమానిస్తారని మండిపడ్డారు.

Priyanka Gandhi: నిశ్శబ్దం, త్యాగం మా విశ్వాసానికి ప్రతీక.. బీజేపీపై ప్రియాంక గాంధీ నిప్పులు
Silent Sacrifice Defines Our Faith Priyanka Gandhi Vadra Emotional Retort To BJP

డెహ్రాడూన్: కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్‌ రామ్ నగర్‌లో ప్రియాంక గాంధీ శనివారం నాడు ప్రచారం చేశారు. త్యాగం గురించి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. బీజేపీలో (BJP), ఏ ఒక్కరి పేరు ప్రస్తావించకుండా ప్రియాంక విమర్శలు చేశారు. దేశం కోసం ఎంత చేసినా సరే తమ కుటుంబాన్ని అవమానిస్తారని మండిపడ్డారు. అయినప్పటికీ తాము నిశ్శబ్దంగా ఉంటామని.. ఆ ఇబ్బందులు ఏంటో తమకు తెలుసు అని వివరించారు.

BJP: అట్టహాసంగా అమిత్‌షా రోడ్‌షో.. మోదీ నినాదాలతో దద్దరిల్లిన మదురై


త్యాగం

‘హిందుమతంలో విశ్వాసానికి అతిపెద్ద నిదర్శనం త్యాగం. నాకు 19 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మా నాన్న మృతదేహం చూశాను. తండ్రి పార్థీవదేహం ముందు నా తల్లి కూర్చొని ఉంది. అప్పుడు తనకు త్యాగం అంటే ఏంటో, ఆత్మ బలిదానం అంటే ఏంటో అర్థమయ్యింది. మాకు దేశం పట్ల నిజమైన విశ్వాసం, భక్తి ఉంది. అందుకే మౌనంగా ఉన్నాం అని’ ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.


ఎన్ని రోజులు నిందలు

భారతీయ జనతా పార్టీపై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎన్ని రోజులు నిందిస్తారు. గత పదేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలో ఉంది. ఇప్పుడు 400 సీట్లు సాధిస్తామని గొప్పలు చెబుతున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తారు. గత 75 ఏళ్లలో ఏమీ జరగలేదని బీజేపీ విమర్శలు చేస్తోంది. నిజంగా అభివృద్ధి జరగకుంటే ఉత్తరాఖండ్‌లో అలాంటి నైపుణ్యాలు ఎలా వెలుగులోకి వచ్చాయి. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ రాలేదా..? చంద్రుడిపై చంద్రయాన్ అడుగిడలేదా..? పండిగ్ నెహ్రూ ఆ రోజున ముందుచూపుతో పనులు చేస్తేనే కదా.. ఈ రోజు ఫలితాలు వస్తున్నాయి అని’ ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు.

Video: సీఎం కోసం స్వీట్ షాప్‌కు వెళ్లిన రాహుల్ గాంధీ..తర్వాత ఏమైందంటే


అంతా అవినీతి పరులే

‘ప్రధాని మోదీ దృష్టిలో అందరూ అవినీతి పరులే అనుకుంటారు. మోదీ ఒక్కరే సచ్చీలురు అనే భావనలో ఉంటారు. తమ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను ఉపయోగిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడతారు. ఈ పనుల వల్ల దేశంలో ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం గురించి బీజేపీ మరచిపోయింది అని’ ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

Kejriwal: ఇదేం పద్ధతి.. జైలులో కేజ్రీవాల్‌ను కలువనీయలేదు..?

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 13 , 2024 | 03:31 PM

Advertising
Advertising